https://oktelugu.com/

War 2 : వార్ 2 కోసం ఎన్టీయార్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ తన నటనతో మరొక మెట్టు పైకి ఎక్కబోతున్నాడు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2024 / 04:43 PM IST

    How much remuneration is NTR taking for War 2?

    Follow us on

    War 2 : తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరూ ప్రస్తుతం మంచి సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఏరికోరి స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది. కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో ఉన్న దర్శకుడు కూడా మన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇటువంటి క్రమం లోనే మనవాళ్లు కూడా ఎక్కడ తగ్గకుండా మన డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు.

    ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది బయటి డైరెక్టర్ల డైరెక్షన్ లో కూడా నటించాల్సి వస్తుంది. అయినప్పటికీ మన వాళ్ళు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తను ‘దేవర ‘ సినిమాతో మరోసారి ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక దాంతో పాటు హిందీ లో వార్ 2 అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

    అయితే ఈ సినిమా కోసం ఆయన 50 రోజుల పాటు తన డేట్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే తను రోజుకు రెండు కోట్ల చొప్పున ఈ సినిమా కోసం మొత్తం 100 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే తెలుగు హీరోల కోసం ఎన్ని డబ్బులు అయినా సరే పెట్టి వాళ్ల చేత ఒక సినిమా అయిన చేయించుకోవాలనే ఉద్దేశ్యం లో బాలీవుడ్ మేకర్స్ ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ అడిగినంత డబ్బులు ఇచ్చి మరి తనతో ఆ క్యారెక్టర్ లో నటింప చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది.

    ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ తన నటనతో మరొక మెట్టు పైకి ఎక్కబోతున్నాడు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక అలాగే బాలీవుడ్ జనాలకి కూడా ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి బాగా అర్థమయ్యే రేంజ్ లో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…