https://oktelugu.com/

OTT Releases: ఈ వారం ఓటీటీలో ఆ క్రేజీ మూవీస్… పుష్ప విలన్ నటించిన ఆ చిత్రం చాలా స్పెషల్!

ఓటీటీలో కొన్ని క్రేజీ మూవీస్ అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ వారం వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి వస్తున్న చిత్రాలు ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : May 6, 2024 / 04:37 PM IST

    OTT Releases this week

    Follow us on

    OTT Releases: వారాంతం వస్తుందంటే మూవీ లవర్స్ కి పండగే పండగ. ఈ సమ్మర్ కి థియేటర్స్ లో పెద్దగా సందడి లేదు. పెద్ద హీరోల చిత్రాలు విడుదల కావడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ క్రమంలో స్టార్స్ తమ చిత్రాల విడుదల వాయిదా వేసుకున్నారు. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఓటీటీలో కొన్ని క్రేజీ మూవీస్ అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ వారం వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి వస్తున్న చిత్రాలు ఏమిటో చూద్దాం..

    పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం. అక్కడ సంచలన విజయం సాధించింది. ఫహద్ ఓ విభిన్నమైన పాత్రలో ఆకట్టున్నారు. బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో మే 9 నుండి అందుబాటులోకి రానుంది.

    యంగ్ హీరో వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, రవి బాబు, శివాజీ రాజా ప్రధాన పాత్రలు చేసిన మూవీ ‘చిత్రం చూడర’ . ఈ చిత్రాన్ని ఆర్ హెచ్ హర్ష వర్షన్ తెరకెక్కించాడు. చిత్రం చూడర తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో మే 9 నుండి స్ట్రీమ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం చూసి ఎంజాయ్ చేయండి.

    సయామీ ఖేర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 8 ఏఎం మెట్రో. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. గుల్షన్ దేవయ్య, సందీప్ భరద్వాజ్ కీలక రోల్స్ చేశారు. ఒక గృహిణి అనుకోకుండా మెట్రో ట్రైన్ లో పరిచయమైన వ్యక్తికి దగ్గర అవుతుంది. ఈ చిత్రం మే 10 నుండి జీ 5లో స్ట్రీమ్ కానుంది.

    ఇక ఆపిల్ టీవీలో డార్క్ మేటర్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఆపిల్ టీవీ ఒరిజినల్ గా నిర్మతమైన ఈ సిరీస్ లో జోయల్ ఎడ్గర్టన్, జెన్నీఫర్ కొన్నోల్లీ ప్రధాన పాత్రలు చేశారు. మే 8వ తేదీ నుండి డార్క్ మేటర్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం చక్కగా చూసి ఎంజాయ్ చేయండి…