Director Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ (Sukumar) ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటికే ఆయన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకోబోతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో తన తదుపరి సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన రామ్ చరణ్ (Ram Charan) తో తన నెక్స్ట్ సినిమాని చేయబోతున్నానని అనౌన్స్ చేశాడు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కథ చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి…ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ సూపర్ సక్సెస్ అయిన తర్వాత సుకుమార్ రెమ్యూనరేషన్ (Remunration) భారీగా పెంచినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు వరకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన ఇప్పుడు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న సుకుమార్ ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
కాబట్టి ఇప్పుడు ఆయనకు రెమ్యూనరేషన్ భారీగా ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు సైతం ముందుకు వస్తున్నారు. నిజానికైతే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన ఇప్పటివరకు చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మరోసారి అదే బ్యానర్ లో సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందించాలని చూస్తున్నాడు.
ఇప్పటికే మైత్రి వాళ్లకు ‘పుష్ప 2’ సినిమాతో భారీ లాభాలు అయితే వచ్చాయి. ఇక ఆ లాభాలను ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టి మరింత లాభాన్ని ఆర్జించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే వాళ్ళ బ్యానర్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతుండగా ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాని కూడా వాళ్ళే నిర్మించడం విశేషం…
ఇక ఈ సినిమా కూడా 80స్ , 90స్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక సుకుమార్ స్క్రిప్ట్ మొత్తం బౌండెడ్ అయిన తర్వాత సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తన అభిమానులకు తెలియజేయడానికి సిద్దమవుతున్నారట…