https://oktelugu.com/

Pushpa 2: The Rule : అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ‘పుష్ప 2’ ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఎంత గ్రాస్ రాబట్టిందో తెలుసా..?

ప్రీమియర్ షోస్ సరైన సమయానికి పడుతాయో లేవో అనే భయం కూడా నార్త్ అమెరికా బయ్యర్స్ లో ఉంది. ఎందుకంటే గతంలో పుష్ప చిత్రాన్ని కూడా ఇలాగే ఆలస్యం చేయడంతో, సరైన సమయానికి డ్రైవ్స్ అందకపోవడంతో షోస్ ని క్యాన్సిల్ చేసారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2024 9:05 pm
    Follow us on

    Pushpa 2: The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 17 వ తారీఖున విడుదల చేయబోతున్నారు మేకర్స్. పాట్నా లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు. ట్రైలర్ లాంచ్ తర్వాత ఈ సినిమా ప్రొమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నాయి. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో శ్రీలీల, అల్లు అర్జున్ పై ఐటెం సాంగ్ చిత్రీకరణ మొదలుపెట్టగా, నేటితో ఆ చిత్రీకరణ పూర్తి అయ్యింది. రేపటి నుండి సారధి స్టూడియోస్ లో అల్లు అర్జున్, రష్మిక పై ఒక డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరించబోతున్నారు. సుకుమార్ తో సినిమా అంటే చివరి నిమిషం వరకు ఇలాంటి పనులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.

    సాధారణంగా ప్రతీ సినిమా విడుదలకు నెల రోజుల ముందే షూటింగ్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ వర్క్ వంటివి పూర్తి చేసి మొదటి కాపీ ని సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ సుకుమార్ మాత్రం విడుదలకు రెండు రోజుల ముందు కూడా ఎదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పుష్ప చిత్రం కూడా ఎన్నో సన్నివేశాలకు VFX పూర్తి కాకముందే విడుదలైంది. అప్పట్లో అలా చేసినందుకు సుకుమార్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు కూడా అలాగే చేసేట్టు ఉన్నాడు. ప్రీమియర్ షోస్ సరైన సమయానికి పడుతాయో లేవో అనే భయం కూడా నార్త్ అమెరికా బయ్యర్స్ లో ఉంది. ఎందుకంటే గతంలో పుష్ప చిత్రాన్ని కూడా ఇలాగే ఆలస్యం చేయడంతో, సరైన సమయానికి డ్రైవ్స్ అందకపోవడంతో షోస్ ని క్యాన్సిల్ చేసారు.

    ఆ ప్రభావం ‘పుష్ప 2’ పై పడినట్టుగా నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికి 4000 కి పైగా షోస్ ని షెడ్యూల్ చేసారు. కేవలం 6 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. పడిన షోస్ సంఖ్య కి ఇది చాలా తక్కువ గ్రాస్ అనే చెప్పాలి. సినిమాకి సంబంధించి లేటెస్ట్ టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ విడుదల కాకపోవడం వల్ల ఈ చిత్రంపై ఈపాటికి ఉండాల్సిన హైప్ లేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించిన రేంజ్ లో లేవని అనుకుంటున్నారు. వీటితో పాటు ప్రీమియర్ షోస్ అనుకున్న సమయానికి పడుతుందో లేదో అనే అనుమానంతో అనేక మంది బుకింగ్స్ చేసుకొని ఉండకపోయుండొచ్చు అని కూడా అనుకుంటున్నారు.ఈ నెల 17 వ తారీఖున విడుదల అయ్యే థియేట్రికల్ ట్రైలర్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.