Prabhas : ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే… ఆయన నాన్ వెజ్ లవర్. మాంసాహారం రోజూ ప్లేట్ లో ఉండాల్సిందే. ప్రతిరోజూ నాలుగైదు రకాల వంటలతో భోజనం లాగిస్తారు. ప్రభాస్ కి ప్రతి రోజూ విందు భోజనమే. కారణం… ఆయన ఒంటరిగా తినరట. సన్నిహితులో, తనతో పని చేసేవారో లేక కుటుంబ సభ్యులో ఉండాల్సిందేనట. ప్రభాస్ తో పాటు పది నుండి ఇరవై మంది కలిసి భోజనం చేస్తారట.
ఇక ప్రభాస్ కి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టేందుకు ఒక చెఫ్ టీమ్ ఉందట. వాళ్ళు ప్రభాస్ కోసం రకరకాల వంటకాలు తయారు చేస్తారట. ప్రభాస్ భోజనం మెనూ చాలా పెద్దగా ఉంటుందట. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు… అన్ని ఉండాల్సిందేనట. ఇక ప్రభాస్ కి రొయ్యల పులావ్ అంటే మహా ఇష్టం. దాన్ని తరచుగా చేయించుకుని తింటారట.
ప్రభాస్ తో పని చేసిన చాలా మంది హీరోయిన్స్, నటులు ఆయన ఆతిథ్యం స్వీకరించారు. ప్రపంచంలోని అరుదైన వంటకాలతో హీరోయిన్స్ కి విందు ఏర్పాటు చేయడం ఆయనకు అలవాటు. శ్రద్దా కపూర్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, పూజ హెగ్డేలు ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. అద్భుతం అని తమ స్పందన తెలియజేశారు.
సలార్ లో నటించిన పృథ్విరాజ్ సుకుమారన్ భార్య, పిల్లలు సెట్స్ కి వచ్చారని తెలుసుకున్న ప్రభాస్… గది మొత్తం వంటకాలతో నింపేశాడట. ప్రభాస్ తో ఉంటే డేంజర్, డైట్ మటాష్ అవుతుందని పృథ్విరాజ్ స్వయంగా తెలియజేశారు. కాగా ఇంతటి ఆహార ప్రియుడైన ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు రూ. 2 లక్షలు అవుతుందట. సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఒక్క రోజుకు రెండు లక్షలు అంటే… నమ్మశక్యం కాని ఫిగర్. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ వసూళ్ళు దుమ్ముదులుపుతుంది.