Shruti Haasan : ముందు ఒకలా వెనుక ఒకలా… ప్రభాస్ అలాంటి వాడు! వైరల్ గా శృతి హాసన్ కామెంట్స్

కాగా శృతి హాసన్ కి 2023 గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి, ఏకంగా మూడు హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విజయం సాధించాయి.

Written By: NARESH, Updated On : December 26, 2023 8:23 pm
Follow us on

Shruti Haasan : సలార్ ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది శృతి హాసన్. ఈ సందర్భంగా ఆమె సలార్ చిత్ర యూనిట్ తో తన అనుభవాలు పంచుకుంటుంది. తాజా ఇంటర్వ్యూలో సలార్ కోస్టార్ ప్రభాస్ పై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ తో నటించిన అనుభవం ఎలా ఉందని అడగ్గా… ప్రభాస్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటారు. స్నేహం చేస్తాడు. సెట్ లో జోవియల్ గా ఉంటాడు. కెమెరా ముందుకు వెళితే భిన్నంగా మారిపోతాడని ఆమె అన్నారు. ఇక సలార్ విజయం సాధిస్తుందని నాకు ముందే అనిపించిందని శృతి హాసన్ అభిప్రాయ పడింది.

ప్రశాంత్ నీల్ సినిమాటిక్ వరల్డ్ లో భాగమైనందుకు నాకు కూడా సంతోషంగా ఉందని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. సలార్ టీమ్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో శృతి హాసన్ ని రాజమౌళి పొగిడారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన శృతి హాసన్ సంతోషం వ్యక్తం చేసింది. రాజమౌళి గారు నా డాన్స్ నచ్చిందని చెప్పారు. అది నాకు పెద్ద ప్రశంస, ఆయన పొగడడం బాగుందని అన్నారు.

కాగా శృతి హాసన్ కి 2023 గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి, ఏకంగా మూడు హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక చివర్లో సలార్ మూవీతో విజయం అందుకుంది. దీంతో శృతి హాసన్ సంతోషం వ్యక్తం చేస్తుంది.

నెక్స్ట్ ఆమె ఐ టైటిల్ తో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చేస్తుంది. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల అడివి శేష్ కి జంటగా డెకాయిట్ అనే చిత్రం ప్రకటించింది. డెకాయిట్ టైటిల్ టీజర్ ఆకట్టుకుంది. శృతి హాసన్ లుక్, డైలాగ్స్ క్యారెక్టరైజేషన్ పై ఆసక్తి రేపుతున్నాయి. డెకాయిట్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. 2017లో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతి హాసన్ 2020లో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది.