దక్షిణ భారత దేశానికి చెందిన ఒక నటి వాస్తవిక జీవితం ఆధారంగా ఈ “షకీలా” మూవీ తెరకెక్కింది. పేదరికంలో పుట్టిన షకీలా కుటుంబం కోసం అనుకోకుండానే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. తన తల్లి అవసరాలు, తన నలుగురు చెల్లెల భవిష్యత్ కోసం, అర్థికంగా నిలదొక్కుకోవడానికి శృంగార నటిగా మారుతుంది. అలా మలయాళ చిత్ర పరిశ్రమలో పాపులర్ పోర్న్ స్టార్‌గా మారుతుంది. షకీలా సినిమాల దెబ్బకి స్టార్ హీరోలు కూడా తలలు పట్టుకునే పరిస్థితి వస్తోంది. దాంతో షకీలా పై మలయాళ సూపర్ స్టార్ సలీమ్ (పంకజ్ త్రిపాఠి) అణగదొక్కేందుకు కుట్రలు పన్నుతాడు. ఒక చిన్న పట్టణం నుండి ప్రారంభమైన ఆమె జీవితం ఆ తర్వాత ఎలాంటి మలుపులు తిరిగి ఏ గమ్యం చేరిందనేది ఈ మూవీలోని ప్రధానాంశం.
Also Read: సంక్రాంతికి టీజర్లతో రానున్న పవన్, ప్రభాస్ !
యువ షకీలాగా కాజోల్ చుగ్, హీరోయిన్‌గా షకీలాగా రిచా చద్దా నటించారు. కథలో బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో రిచా చద్దా షకీలాగా వెండితెరపైన తన మెరుపులు మెరిపించలేకపోయింది.మలయాళ సూపర్ స్టార్ సలీంలో పాత్రలో పంకజ్ త్రిపాఠి ఒదిగిపోయాడు. తనదైన శైలిలో సాఫ్ట్ విలన్ పాత్రను పోషించాడు. పాత తరం స్టార్ హీరోల హావభావాలు, డ్రస్పింగ్ స్టైల్ ఒడిసిపట్టుకోవడంలో దాదాపు సఫలమయ్యారు. షకీలాను ఓ ఎమోషనల్ సినిమాగా, భావితరం యువ హీరోయిన్లకు కనువిప్పు, స్పూర్తిగా తీయాల్సిన మూవీగా తెరకెక్కించడంలో దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ పూర్తిగా విఫలమయ్యాడు.
Also Read: ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా..!
సరైన కథను, పక్కా కథనాన్ని ప్లాన్ చేసుకొంటే డర్టీ పిక్చర్‌ను మంచిని బయోపిక్ అయ్యుండే బంగారు అవకాశాన్ని వదులుకొన్నాడనే చెప్పవచ్చు. మొత్తంమీద, ‘షకీలా’ అనేది నెల కొరిగిన ఒక నటి జీవితం.. అలాగే షకీలా గురించి అంతగా తెలియనివారికి ఆమె కథను తెలియచెప్పే ప్రయత్నాన్ని మాత్రం నిజాయితీగా చేశారని చెప్పుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్