
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అండగా ఉండి వారి సమస్యలపై పోరాడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రానికి 40 శాతం ఆదాయం సమకూర్చే రైతాంగానికి అండగా ఉండకపోతే 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో పవన్ మాట్లాడారు. తాము ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నామంటున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి అస్సలు భయపడడని వ్యాఖ్యానించారు.