OOT : అప్పుడే ఓటీటీలో భారతీయుడు 2, డిజాస్టర్ టాక్ నేపథ్యంలో అగ్రిమెంట్ కి ముందే వచ్చేస్తున్న కమల్, ఎక్కడ చూడొచ్చు

భారతీయుడు 2 అంచనాలు అందుకోలేదు. కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో భారతీయుడు 2 ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. అనుకున్న సమయం కంటే ముందే ఓటీటీలో విడుదల చేస్తుండగా.. ఎప్పుడు? ఎక్కడ? చూడొచ్చు అనేది తెలుసుకుందాం..

Written By: S Reddy, Updated On : July 22, 2024 3:03 pm
Follow us on

OOT : భారతీయుడు 2 అంచనాలు అందుకోలేదు. కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో భారతీయుడు 2 ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. అనుకున్న సమయం కంటే ముందే ఓటీటీలో విడుదల చేస్తుండగా.. ఎప్పుడు? ఎక్కడ? చూడొచ్చు అనేది తెలుసుకుందాం..

కొన్ని క్లాసిక్స్ ని టచ్ చేయకపోతేనే బెటర్. ఓ గొప్ప చిత్రానికి రీమేక్స్, సీక్వెల్స్ సెట్ కాకపోవచ్చు. లెజెండరీ దర్శకుడు కేవీ రెడ్డి తెరకెక్కించిన మాయాబజార్ ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఫిల్మ్ మేకర్స్ కి ఒక డిక్షనరీ వంటిది. మాయాబజార్ తరహా చిత్రాలు తర్వాత కాలంలో చాలా వచ్చాయి. కానీ మాయాబజార్ ని మరిపించలేకపోయాయి. హిందీ ఇండస్ట్రీలో ఐకానిక్ మూవీగా ఉన్న షోలే చిత్రాన్ని ఆగ్ టైటిల్ తో రీమేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ పరువు పోగొట్టుకున్నాడు. షోలే రీమేక్ ఆగ్ డిజాస్టర్ అయ్యింది.

భారతీయుడు మూవీ కూడా ఒక ట్రెండ్ సెట్టర్. 1996లో వచ్చిన భారతీయుడు పాన్ ఇండియా మూవీగా విడుదలై అన్ని భాషల్లో విజయం సాధించింది. హిదూస్తాని టైటిల్ తో హిందీలో విడుదల చేశారు. నార్త్ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ ఎదుట క్యూ కట్టారు. ఒకప్పటి ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్ర భారతంలో అతి పెద్ద సమస్యగా తయారైన లంచగొండి తనం మీద యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, అనే కాన్సెప్ట్ ఆడియన్స్ కి గట్టిగా కనెక్ట్ అయ్యింది.

ఆల్ టైం బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ అనగానే సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ హాసన్ సేనాపతిగా మరోసారి మ్యాజిక్ చేస్తాడని ఆడియన్స్ ఆశించారు. అయితే అది జరగలేదు. భారతీయుడు 2 ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. పార్ట్ 3 కోసం అసంపూర్ణంగా కథ చెప్పాడు శంకర్. దానికి తోడు భారతీయుడు చిత్రంలో ఉన్న బలమైన ఎమోషనల్ యాంగిల్ సీక్వెల్ లో మిస్ అయ్యింది. వెరసి భారతీయుడు 2 డిజాస్టర్ దిశగా వెళుతుంది.

నెగిటివ్ టాక్ నేపథ్యంలో అనుకున్న సమయానికి ముందే భారతీయుడు 2 ఓటీటీ లో స్ట్రీమ్ కానుందట. భారతీయుడు 2 డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకుంది నెట్ఫ్లిక్స్. నిర్మాతలతో అగ్రిమెంట్ ప్రకారం థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల అనంతరం ఓటీటీలో విడుదల చేయాలి. భారతీయుడు 2 బాక్సాఫీస్ రన్ దాదాపు ముగిసినట్లే. మరో వారం తర్వాత కనీస వసూళ్లు కూడా కష్టం.

ఈ నేపథ్యంలో భారతీయుడు 2 డిజిటల్ స్ట్రీమింగ్ కి నెట్ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్టు 2 నుండి భారతీయుడు 2 ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. కమల్ హాసన్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.

భారతీయుడు 2 కథ విషయానికి వస్తే… సేనాపతి అవినీతి పరుడైన కొడుకును చంపి విదేశాలకు వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల అనంతరం ఇండియాలో మరలా అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది. సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా అవినీతి పరుల మీద పోరాటం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి శతృవులు ఎక్కువవుతారు. వారికి బుద్ధి చెప్పాలంటే భారతీయుడు తిరిగి రావాలని సోషల్ మీడియా క్యాంపైన్ చేస్తాడు సిద్ధార్థ్. తిరిగి ఇండియాలో అడుగుపెట్టిన భారతీయుడు అక్రమార్కుల అంతు ఎలా చూశాడు? ఈ ప్రయాణంలో ఆయనకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది కథ. కమల్ హాసన్ ఫ్యాన్స్ ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.