Mahesh Babu – Balakrishna : బాలయ్య బాబు అల్లుడు కావాల్సిన మహేష్ బాబు… ఎలా మిస్ అయిందంటే..?

స్వతహాగా హీరోయిన్ అయిన నమ్రత పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేసి పిల్లల బాగోగులు చూసుకుంటూ వస్తున్నారు.

Written By: NARESH, Updated On : October 2, 2023 6:44 pm
Follow us on

Mahesh Babu Balakrishna : ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అనతికాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చేసిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ లు అందుకోవడంతో మహేష్ బాబు చాలా చిన్న ఏజ్ లోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక మైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మహేష్ బాబు సినిమా లైఫ్ ఇలా ఉంటే…ఒకసారి ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకొందాం…

ఆయన నమ్రత శిరోడ్కర్ అనే హీరోయిన్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకి తండ్రి అయిన విషయం మనకు తెలిసిందే. ముందుగా నమ్రత మహేష్ బాబు తో వంశీ అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు వీళ్ళిద్దరికీ కలిగిన పరిచయం వల్ల మొదట ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఒకరి ఇష్టాలు మరొకరికి నచ్చడంతో ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమ పెళ్లి వరకు సాగింది ఇక ప్రస్తుతం వాళ్లకు గౌతమ్ సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. స్వతహాగా హీరోయిన్ అయిన నమ్రత పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేసి పిల్లల బాగోగులు చూసుకుంటూ వస్తున్నారు.

ఇక వీళ్లిద్దరి మధ్య ఏ గొడవలు లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు కలిసి మెలిసి ఉండటాన్ని చూసిన చాలా మంది జనాలు వీళ్ళ జంట ని ఆదర్శంగా తీసుకోవాలంటూ వీళ్ళ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లు కొడుతున్న సమయంలో బాలకృష్ణ పెద్ద కూతురు అయిన బ్రహ్మిణి ని మహేష్ బాబు కి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు.ఇక మహేష్ బాబు వాళ్ళ నాన్న కృష్ణ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ అవడం,మహేష్ బాబు కూడా హీరో గా ఇండస్ట్రీ లో రాణిస్తూ ఉండడం. దానికి తోడు మహేష్ బాబు చూడడానికి అందంగా ఉంటాడు కాబట్టి బాలయ్య మహేష్ ను అల్లుడుగా చేసుకోవాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే ప్రపోజల్ని బాలయ్య బాబు స్వయంగా  మహేష్ బాబు ముందు ఉంచితే ఆయన సింపుల్ గా సారీ చెప్పారట దానికి కారణం ఏంటి అంటే అప్పటికే ఆయన నమ్రత తో ప్రేమలో ఉండడం.

దానివల్లే బాలయ్య కూతురు అయిన బ్రాహ్మిణి ని పెళ్లి చేసుకోలేదని చాలా రకాల మీడియా సంస్థలు అప్పట్లో ఈ వార్తను రాయడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా అదే విషయం నెట్లో తెగ హల్చల్ అవుతుంది… మహేష్ జీవితంలోకి ముందుగా నమ్రత కనక వచ్చి ఉండకపోతే మహేష్ బాబు బాలయ్య బాబుకి అల్లుడు అయ్యేవాడని చాలామంది ఇప్పటికీ ఈ విషయం గురించి చెప్తూ ఉంటారు…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా లో బిజీ గా ఉన్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…