
Genelia D’Souza : హాహా హాసిని అంటూ ముద్దుగా అల్లరిగా కనిపించిన మన జెనీలియా ఇప్పుడు లావై పోయింది. మరీ బొద్దుగా మారిపోయింది. మహారాష్ట్ర మాజీ సీఎం, కం హీరో రితీష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా హౌస్ వైఫ్ గా మారిపోయింది. కుటుంబ బాధ్యతలకే పరిమితమైంది. కొన్ని ప్రైవేటు కార్యక్రమాలు తప్పితే సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.
అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొంది. అది స్కూలు కార్యక్రమా? లేక ఏదో కల్చరల్ ఈవెంట్ కావచ్చు. అందులో పాల్గొని ప్రసంగించింది. అప్పటి జెనీలియాకు ఇప్పటి జెనీలియాకు చాలా తేడా ఉంది.
జెనీలియా బొమ్మరిల్లులో ఎంతో స్లిమ్ గా నాటీగా ఉండిందో ఇప్పుడు కూడా అంతే చలాకీగా ఉంది. కానీ కాస్త బొద్దుగా మారింది. అందం, చందంలో ఏమాత్రం తేడా లేకున్నా.. అమ్మడు ఏజ్ ఫ్యాక్టర్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు, తమిళం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జెనీలియా ‘బొమ్మరిల్లు’ సినిమాతో ఫేమస్ అయ్యింది. తమిళంలో ‘బాయ్స్ ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా చేసిన తర్వాత రితీష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం లేదు.