https://oktelugu.com/

Bigg Boss telugu 8 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ..ఆమె ఎవరో చూస్తే కుర్రాళ్ళు నిద్రపోలేరు!

ఎలిమినేషన్ తో పాటుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక కంటెస్టెంట్ ని హౌస్ లోపలకు పంపే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'గుప్పెడంత మనసు' లాంటి బ్లాక్ బస్టర్ సీరియల్ లో జగతి అనే తల్లి పాత్ర ద్వారా జ్యోతి రాయ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : September 5, 2024 / 08:45 PM IST

    Jyothi Roy

    Follow us on

    Bigg Boss telugu 8 :  బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభమై మంచి హీట్ వాతావరణంలో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. లాంచ్ ఎపిసోడ్ తోనే కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టేసిన బిగ్ బాస్, ఇప్పుడు నామినేషన్స్ ప్రక్రియ తో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు అరుచుకునేలా చేసాడు. నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో నాగ మణికంఠ బాగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేసి నామినేట్ చేసారు. నా గురించి బయట జనాలు ఏమి అనుకుంటున్నారో, బిగ్ బాస్ వదిలి బయటకి వస్తే నా జీవితం ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి అంటూ నాగ మణికంఠ ఎమోషనల్ అవుతూ తన విగ్ ని కూడా పీకేసాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అతన్ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసాడు.

    ఇక నేటి నుండి టాస్కులు హోరాహోరీగా జరగనున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఎలాగో ఒక ఎలిమినేషన్ ఉంటుంది, ఎలిమినేషన్ తో పాటుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక కంటెస్టెంట్ ని హౌస్ లోపలకు పంపే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘గుప్పెడంత మనసు’ లాంటి బ్లాక్ బస్టర్ సీరియల్ లో జగతి అనే తల్లి పాత్ర ద్వారా జ్యోతి రాయ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈమె వయస్సు చాలా చిన్నది, అయినప్పటికీ కూడా తల్లి పాత్రని ఛాలెంజ్ గా తీసుకొని అద్బుతమగా నటించి అశేష ప్రేక్షకాభిమానం పొందింది. అయితే సోషల్ మీడియా లో ఈమె తన అందాన్ని ఆరబోస్తూ అప్లోడ్ చేసే ఫోటోలు, రీల్ వీడియోస్ కి యూత్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఒక్కసారి తెరిచి చూస్తే అర్థం అవుతుంది. ఇంత అందంగా ఉండే ఈ అమ్మాయి తల్లి పాత్రలో ఎలా నటించింది అని షాక్ కి గురయ్యారు నెటిజెన్స్. సీరియల్స్ తో పాటు ఈమె సినిమాలు కూడా రెగ్యులర్ గా చేస్తుంది.

    ప్రముఖ దర్శకుడు సుక్కు ని ప్రేమించి పెళ్లాడిన ఈమె, ఆయన దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఒక పాన్ ఇండియన్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈమె ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది. వీటితో పాటు పలు తమిళ సినిమాల్లో కూడా నటించింది. అలా తన చేతిలో ఉన్న కమిట్మెంట్స్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈమె, ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టనుంది. ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటితనం స్వభావం ఉండే జ్యోతి రాయ్ ఈ సీజన్ ఫైర్ బ్రాండ్ గా అవతరించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్నటువంటి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.