https://oktelugu.com/

Hero Vikram : నా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వాలని నా భార్య దేవుడిని కోరుకుంటూ ఉంటుంది: హీరో విక్రమ్

ఆయన మాట్లాడుతూ 'నేను సినిమాల్లో కొనసాగడం నా భార్యకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాను, ఎన్నో సార్లు తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. ఇదంతా చూసి నా భార్య నాతో గొడవ పెట్టుకొని ఏడ్చేసేది.

Written By:
  • Vicky
  • , Updated On : September 5, 2024 / 08:22 PM IST

    Hero Vikram

    Follow us on

    Hero Vikram : సౌత్ ఇండియాలో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే తత్త్వం ఉన్న హీరోలలో ఒకరు చియాన్ విక్రమ్. సినిమా కోసం ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయని సందర్భాలు ఉన్నాయి. కమర్షియల్ సినిమాలకు బిన్నంగా, హీరో విక్రమ్ విభిన్నమైన గెటప్స్ తో సినిమాలు చేయడం, సినిమా పట్ల ఆయనకీ ఉన్న పిచ్చి ఎలాంటిదో అందరికి అర్థం అవుతుంది. ఆయన ఎంచుకున్న దారిలో వెళ్ళగానే వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఫ్లాప్స్ వచ్చాయి కదా అని తన మనసుని చంపుకొని కమర్షియల్ సినిమాలు చేయడు. ఒకప్పుడు తమిళం లో విక్రమ్ కమర్షియల్ సినిమాలకు చిరునామా లాంటి వాడు. ఆయన నటించిన అనేక సినిమాలు సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేవి. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న విక్రమ్ ‘శివ పుత్రుడు’ సినిమా నుండి కమర్షియల్ సినిమాలకు బాగా దూరం అయ్యాడు.

    ఈ చిత్రం తర్వాత ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేసిన ‘అపరిచితుడు’ చిత్రం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో షాక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమా హిట్ అవ్వడం తో విక్రమ్ అలాంటి తరహా సినిమాలే చేస్తూ వచ్చాడు. కానీ అవి ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్ గా ఆయన పీఏ రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే చిత్రం చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా చియాన్ విక్రమ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన భార్య కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను సినిమాల్లో కొనసాగడం నా భార్యకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాను, ఎన్నో సార్లు తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. ఇదంతా చూసి నా భార్య నాతో గొడవ పెట్టుకొని ఏడ్చేసేది. ఈయన సినిమా కోసం ఏదైనా చేసేలా ఉన్నాడు, ఆయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వాలి, అప్పుడైనా ఈ రంగం ని వదిలేస్తాడు అని కోరుకునేదట.

    కానీ ఆ తర్వాత మెల్లగా ఆమె నన్ను అర్థం చేసుకుంది. ఇప్పుడు నా సినిమా కోసం ఆమె పని చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు విక్రమ్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.ఐ సినిమా సమయంలో అకస్మాత్తుగా శరీరం పెంచాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని, ఆ సమయంలో నేను పడిన కష్టాలు చూసి నా భార్య ఏడ్చేసేది అంటూ చెప్పుకొచ్చాడు విక్రమ్. ఇకపోతే ‘తంగలాన్’ చిత్రం తర్వాత విక్రమ్ నటించిన ‘ధ్రువ నక్షత్రం’ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు థియేటర్స్ లోకి రాలేదు.