Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ప్రీతియోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని ధన లాభం ఉండనుంచి. మరికొన్ని రాశులవారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
వ్యాపారులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. శత్రువులపై ఓ కన్నేసి ఉంచండి.
వృషభ రాశి:
అకస్మాత్తుగా ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. అయితే ఉద్యోగులు ఉల్లాసమైన వాతావరణంలో ఉంటారు. శుభకార్యాలల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనకోకుండా ధన లాభం ఉంటుంది.
మిథున రాశి:
డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. అనుకోని అదృష్టం వరించనుంది.
కర్కాటక రాశి:
ఖర్చులను నియంత్రించుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు కొన్ని పోటీ పరీక్షలు రాస్తారు. ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు.
సింహారాశి:
గృహ అవసరాల కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని మంచి పనులు చేయడం వల్ల సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
కన్య రాశి:
వ్యాపారులకు కొత్త ఇబ్బందులు ఏర్పడుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. బంధువుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. పెండింగ్ పనులు మధ్యాహ్నం వరకు పూర్తి చేస్తారు.
తుల రాశి:
జీవిత లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలను ఆపకూడదు. కష్టమైన సమయంలో స్నేహితులు ఆదుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
వ్యాపారులకు భాగస్వాములు సహకరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చుల కూడా ఉంటాయి. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటార.
ధనస్సు రాశి:
వ్యాపారలక కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. తక్కువ సమయంలో కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మకర రాశి:
విదేశాల్లో నివసిస్తన్న వారి నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఏదైనా పనిని మొదలు పెడితే దానిని త్వరగా పూర్తి చేయాలి. సాయంత్రి స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థుల కోసం చేపట్టని ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుంభరాశి:
వ్యాపారాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొత్తగా ఇన్వెస్ట్ మెంట్ చేసేవారికి అనుకూల సమయం. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. బంధువులతో కొన్ని వివాదాలు ఉంటాయి.
మీనరాశి:
సమాజంలో గౌరవం పొందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది.