https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘నువ్వు అసలు మనిషివా..పశువువా’ అంటూ వెళ్లేముందు మణికంఠ పై విరుచుకుపడిన ఆదిత్య ఓం!

నేడు ఎపిసోడ్ ముగిసే 20 నిమిషాల ముందు ఆదిత్య ఓం ని నాగార్జున స్టేజి మీదకు పిలిపిస్తాడు. ఆ తర్వాత ఆయన బిగ్ బాస్ జర్నీ కి సంబంధించిన AV ని ప్రసారం చేయగా, ఆదిత్య బాగా ఎమోషనల్ అవుతాడు. అనంతరం హౌస్ మేట్స్ తో మాట్లాడుతాడు. అయితే బయటకి వెళ్లే కంటెస్టెంట్స్ ని మామూలుగా పంపడం బిగ్ బాస్ హిస్టరీ లోనే లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 6, 2024 / 08:37 AM IST

    Bigg Boss Telugu 8(83)

    Follow us on

    Bigg Boss Telugu 8: అందరూ ఎంతగానో ఎదురు చూసిన వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. నాగార్జున ఇవ్వాల్సిన కంటెస్టెంట్స్ కి గట్టిగా ఇచిపారేసాడు, ముఖ్యంగా నాగమణికంఠ గేమ్ స్ట్రాటజీ ని అరికట్టేందుకు చాలా వరకు ప్రయత్నం చేసాడు. ఇదంతా పక్కన పెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆదిత్య ఓం హౌస్ నుండి బయటకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు ఎపిసోడ్ ముగిసే 20 నిమిషాల ముందు ఆదిత్య ఓం ని నాగార్జున స్టేజి మీదకు పిలిపిస్తాడు. ఆ తర్వాత ఆయన బిగ్ బాస్ జర్నీ కి సంబంధించిన AV ని ప్రసారం చేయగా, ఆదిత్య బాగా ఎమోషనల్ అవుతాడు. అనంతరం హౌస్ మేట్స్ తో మాట్లాడుతాడు. అయితే బయటకి వెళ్లే కంటెస్టెంట్స్ ని మామూలుగా పంపడం బిగ్ బాస్ హిస్టరీ లోనే లేదు. ఎదో ఒక గేమ్ ని ఆడించే పంపిస్తారు. అలా ఆదిత్య తో ‘హాగ్ & పంచ్’ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్.

    ఈ టాస్కులో నువ్వు హగ్గు ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావో, పంచ్ ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావో ఇచ్చేయ్ అంటాడు నాగార్జున. ఈ టాస్కు ఆడే ముందు హౌస్ మేట్స్ అందరికి ఆదిత్య ఓం పుట్టినరోజు అనే విషయాన్ని చెప్తాడు నాగార్జున. హౌస్ మేట్స్ అందరూ ఆదిత్య కి శుభాకాంక్షలు తెలియచేస్తారు. ఇక ఆ తర్వాత గేమ్ ని ప్రారంభిస్తూ ముందుగా హగ్ ని నబీల్ కి ఇస్తాడు ఆదిత్య. ఆ తర్వాత అతనితో మాట్లాడుతూ ‘నబీల్ నీకు బాగా తెలుసు, నువ్వు నాకు గుండెతో సమానం. నువ్వు బిగ్ బాస్ టైటిల్ ని కొడితే ఆదిత్య ఓం కొట్టినట్టే, బాగా ఆడు’ అని అంటాడు. ఆ తర్వాత విష్ణు ప్రియ కి హగ్ ఇస్తూ ‘విష్ణు ప్రియ చాలా స్వచ్ఛమైన మనసు ఉన్న అమ్మాయి. ఒక నది లాగా ప్రవహిస్తూ ఉంటుంది..ఆ ప్రవహించే క్రమంలో ఒక్కోసారి అదుపు తప్పుతుంది, కాస్త అది సరి చేసుకో అంటాడు’.

    ఇక ఆ తర్వాత ఆయన పృథ్వీ కి హగ్ ఇస్తూ ‘మొదటి వారం నుండి ఇప్పటి వరకు నీ గేమ్ తీరుని మార్చుకున్న విధానం నాకు చాలా నచ్చింది. నువ్వు చాలా నిజాయితీ గల మనిషివి’ అంటూ పొడతలతో ముంచి ఎత్తుతాడు. ఆ తర్వాత నిఖిల్,ప్రేరణలను కూడా హగ్ క్యాటగిరీ లో వేస్తాడు ఆదిత్య. ఇక పంచ్ క్యాటగిరీ లో మణికంఠ, సీత, యష్మీ లను వేస్తాడు. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే ఆదిత్య ఓం బిగ్ బాస్ బజ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో ఆయన అర్జున్ అంబటి తో చేసిన సంభాషణ చాలా ఫన్నీ గా ఉంటుంది. ప్రోమో చివర్లో మీరే క్లాన్ అయితే హౌస్ మేట్స్ ని ఎలా డీల్ చేస్తారో చూపించండి అని అనగా. మణికంఠ పై ఆదిత్య రెచ్చిపోతాడు. ఆయన మాట్లాడుతూ ‘అసలు మణికంఠ..నువ్వు మనిషివా?,జంతువువా?..ఎన్ని సార్లు నీ దగ్గరకు వచ్చి చెప్పాను. నీకు సరైన సలహాలు ఇచ్చేవాడిని. కానీ నేను ఇచ్చిన సలహాలను ఒక్కటి కూడా తీసుకోలేదు, ఎప్పుడు నిరూపించుకుంటావు జీవితంలో నువ్వు, అసలు చిన్న బుర్ర ఉందా నీకు’ అని అంటాడు. అసలు ఏమి జరిగింది అనేది ఫుల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది.