Jani Master: బిగ్ బ్రేకింగ్ : జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు రద్దు చేసిన కమిటీ..ఇక బెయిల్ వృధా అయినట్టే!

'పోస్కో' చట్టం క్రింద కేసు నమోదు అయిన వ్యక్తి జాతీయ అవార్డుని అందుకునేందుకు అనర్హుడు అని కమిటీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త జానీ మాస్టర్ కి, ఆయన కుటుంబానికి కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ధనుష్ హీరో గా నటించిన 'తిరు చిత్రంబలం' చిత్రంలో ఒక పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసినందుకు గాను జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ని ప్రకటించారు.

Written By: Vicky, Updated On : October 6, 2024 7:55 am

Jani Master

Follow us on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు గత కొంత కాలం గా మీడియా లో ఒక రేంజ్ ట్రెండ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రేష్టి వర్మ అనే యువతి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు పెట్టడం, మైనర్ కాకముందే ఆమెపై అత్యాచారం ప్రయత్నం చేసాడు అని ఆమె ఆరోపణలు చేయడంతో ఆయనపై పోస్కో చట్టం క్రింద కేసు ని నమోదు చేసి రిమాండ్ కి తరలించడం, ఆ తర్వాత ఆయన్ని కస్టడీ లోకి కూడా తీసుకొని విచారించడం వంటివి జరిగాయి. అయితే జానీ మాస్టర్ తనకు వచ్చిన నేషనల్ అవార్డు ని తీసుకోవడం కోసం బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. రేపు ఆయన బెయిల్ మీద విడుదల అవ్వబోతున్నాడు. అయితే కాసేపటి క్రితమే జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ని రద్దు చేస్తున్నట్టు కమిటీ అధికారిక ప్రకటన చేసింది.

‘పోస్కో’ చట్టం క్రింద కేసు నమోదు అయిన వ్యక్తి జాతీయ అవార్డుని అందుకునేందుకు అనర్హుడు అని కమిటీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త జానీ మాస్టర్ కి, ఆయన కుటుంబానికి కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ధనుష్ హీరో గా నటించిన ‘తిరు చిత్రంబలం’ చిత్రంలో ఒక పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసినందుకు గాను జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ని ప్రకటించారు. నేషనల్ అవార్డు ప్రకటించిన తర్వాత జానీ మాస్టర్ క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరింది. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చినందుకు ఎంతో గొప్పగా అభినందించారు. అయితే ఆ అవార్డు తీసుకునే లోపు జానీ మాస్టర్ జీవితం తలక్రిందులు అయిపోయింది. జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యినందుకు కంటే ఎక్కువగా, ఈ నేషనల్ అవార్డు రద్దు అయ్యినందుకు ఇంకా ఎక్కువ బాధ పడి ఉంటాడు. ఎందుకంటే ఆ స్థాయి ఆయనకు ఊరికినే రాలేదు.

ఒక గ్రూప్ డ్యాన్సర్ గా మొదలై ఎన్నో అష్టకష్టాలు అనుభవించి, కొరియోగ్రాఫర్ గా మారి, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఉన్నటువంటి టాప్ స్టార్ హీరోలందరితో అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేయించి విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అలా సాఫీగా సాగిపోతున్న ఆయన సినీ కెరీర్ ఇలా చిక్కులో పడుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే ఆయన కచ్చితంగా ఈ అవమానాలకు, శిక్షలకు అర్హుడే, కానీ నిర్దోషి అయ్యుంటే మాత్రం ఆయనకు జరిగింది మామూలు అన్యాయం కాదనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గానే ఒక ఆడియో రికార్డు బయటకి వచ్చింది. ఆ ఆడియో రికార్డు విన్న తర్వాత జానీ మాస్టర్ అమాయకుడేమో అని అందరికీ అనిపించింది, మరి కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో చూడాలి.