Cannes Film Festival 2024: ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ఈ చిత్రోత్సవాల్లో భారత్ సినిమా సత్తా చాటింది. సన్ ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిల్మ్ 2024కు ఉత్తమ షార్ట్ ఫిల్మగా బహుమతి గెలుచుకుంది.
17 చిత్రాలతో పోటీపడి..
చిదానంద.ఎస్.నాయక్ తెరకెక్కించిన సన్ ఫ్లవర్ ఫర్ ద ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిలిం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 17 సినిమాలతో పోటీపడింది. ఈ రేసులో భారతీయ సినిమా మొదటి బహుమతి అందుకుంంది. ప్రపంచవ్యాప్తంగా 555 షిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల నిడివితో ఉన్న ఈ షార్ట్ పిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.
యూకే చిత్రానికి మూడో బహుమతి..
ఇదే విభాగంలో బన్నీహుడ్ అనే యూకే షార్ట్ ఫిలిం మూడో బహుమతి సాధించింది. ఈ చిత్రాన్ని మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్ర నిర్మాత మహేశ్వరి రూపొందించారు. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డు గెలుచుకున్న టీంకు 15,000 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్ ఫిలిం టీంలకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sunflowers where the first ones to know by chidananda s naik wins cannes la cinefe award for best short
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com