https://oktelugu.com/

Deadpool And Wolverine Collection: ‘డెడ్ పూల్ అండ్ వాల్వరిన్’ మూడు రోజుల్లో అన్ని వేల కోట్ల కలెక్షన్స్ ను సంపాదించిందా..?

హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అవుతున్నాయి. అలాగే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి...ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఇండియాలో కూడా కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 08:33 AM IST

    Deadpool And Wolverine Collection

    Follow us on

    Deadpool And Wolverine Collection: ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సినిమా ఇండస్ట్రీలన్నింటిలో హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ క్రేజ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ అయితే ఉంటుంది. ఇక వాళ్ళు ఆ సినిమాని చూడడానికి అమితమైన ఇష్టాన్ని చూపిస్తారు. రెగ్యులర్ తెలుగు సినిమాలను గాని లేదా ఇండియన్ సినిమాలను గాని చూసే ప్రతి ఒక్కరికి హాలీవుడ్ సినిమా చూడాలనే ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో విజువల్ వండర్స్ ని చూడొచ్చు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా గ్రాండ్ గా తెరకకెక్కించడమే కాకుండా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించేలా వాటిని తీసి ఉంటారు. అలాగే ఎమోషన్ ని బిల్డ్ చేయడంలో హాలీవుడ్ ఇండస్ట్రీ ది అందవేసిన చేయ్యి అనే చెప్పాలి. ప్రతి సీన్ ని చాలా డిటెయిల్ నరేషన్ తో చూపిస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని మంత్రముగ్ధుల్ని చేయడంలో వాళ్ళను మించిన వారు మరొకరు ఉండరు అనేది వాస్తవం…ఇక ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో కూడా గ్రాఫిక్స్ తో వండర్స్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.

    Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది…

    ఇక అందులో చాలా వరకు సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘డెడ్ పూల్ అండ్ వాల్వరన్’ సినిమా ఇండియాలో కూడా భారీ కలెక్షన్స్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది…ఇక ఇప్పటివరకు ఈ సినిమా మూడు రోజుల్లో 3650 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో 65 కోట్ల కలెక్షన్లను కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా కోసం 1650 కోట్ల రూపాయలను బడ్జెట్ గా కేటాయించినట్టుగా తెలుస్తుంది.

    అంటే ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ కలెక్షన్స్ ను వసూలు చేసి గ్రాండ్ విక్టరీని సాధించడమే కాకుండా హాలీవుడ్ సినిమా స్టాండర్డ్ ని మరింత పెంచిందనే చెప్పాలి. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. అలాగే ఈ సినిమా చూసే ప్రేక్షకుడు ఈ సినిమా మీద పెట్టిన టికెట్ డబ్బులకి అంతకు అంత న్యాయం చేసిందనే చెప్పాలి…ఇక చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్లదాకా ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారనే చెప్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలను చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటారు. అందుకే హాలీవుడ్ సినిమాలను పెద్దవాళ్ల కంటే కూడా చిన్నవాళ్లు అమితమైన ఇష్టంతో ఒకటికి రెండుసార్లు ఈ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు…

    ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరికొన్ని హాలీవుడ్ సినిమాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద కన్నెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక మొత్తానికి అయితే ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సినిమా ఒక బుస్టాప్ ని ఇచ్చిందనే చెప్పాలి… జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి స్టార్ డైరెక్టర్లు మాత్రమే కాకుండా మిగతా డైరెక్టర్లు కూడా వాళ్ళు తీసిన హాలీవుడ్ సినిమాలను ఇండియా లో రిలీజ్ చేసి ఇక్కడ కలెక్షన్లను కొల్లగొట్టి చూపిస్తామంటూ ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకున్నారు…ఇక ఈ సినిమా యూనిట్ రీసెంట్ గా థాంక్స్ మీట్ కూడా పెట్టి సినిమా ను ఆదరించిన వాళ్ళందరికి థాంక్స్ చెప్పారు…

    Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…