Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ సంవత్సరం వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఈ సంవత్సరం పాన్ ఇండియాలో భారీ ప్రభంజనాన్ని సృష్టించారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తనదైన రీతిలో ఈ ఇయర్ కి ఎండ్ కార్డు వేయాలనే దిశగా ముందుకు సాగుతున్నాడు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ ఇయర్ ఎండింగ్ లో ఒక హై వోల్టేజ్ బాక్సాఫీస్ బొనాంజా ను గిఫ్ట్ గా ఇచ్చే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు…ఇక రిలీజ్ కి ముందే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందనే అంచనాలో సినిమా మేకర్స్ అయితే ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక 2024వ సంవత్సరానికి పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ముగింపు పలుకుతుంటే 2025 వ సంవత్సరానికి గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ ఆ ఇయర్ లో మొదటి సక్సెస్ ని అందించడానికి సిద్ధమవుతున్నాడు… ఇక గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి హైప్ అయితే ఉంది. పుష్ప 2 సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికైతే ఈ రెండు సినిమాలు పెద్ద సినిమాలుగా రావడమే కాకుండా ఇద్దరు పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు కావడం విశేషం…
ఇక వీళ్లిద్దరూ వాళ్ల సినిమాలను తీర్చిదిద్దుకున్న తీరు అమోఘం అనే చెప్పాలి. ఒకరితో ఒకరికి పోటీ అయితే లేదు కానీ వాళ్ల సినిమాలతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక ఈ రెండు సినిమాల మధ్య ఉన్న తేడా ఏంటి అంటే పుష్ప 2 సినిమాకి భారీ హైప్ అయితే ఉంది. ఎందుకంటే దీనికి ముందే ప్రాంచైజీ గా వచ్చిన పుష్ప మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమా మీద భారీ హైప్ అయితే ఉంది.
ఇక గేమ్ చేంజర్ సినిమా మీద అంత భారీ హైప్ లేకపోవడానికి కారణం ఏంటి అంటే శంకర్ ఇంతకుముందు సినిమా అయిన భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు. దాంతో ఫెయిల్యూర్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద అంత పెద్ద అంచనాలైతే లేవు…