Hit3 VS Retro : తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు నాని(Nani)… ఆయన చేసే ప్రతి సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక హిట్ 3 (Hit 3) సినిమాతో మే ఒకటోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే స్టార్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య(Surya) హీరోగా వస్తున్న రెట్రో (Retro) సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇక దాంతో ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధిస్తోంది అంటూ సూర్య తో పాటు అతని అభిమానులు సైతం మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. ఇక తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది.
Also Read : గుడ్ బ్యాడ్ అగ్లీ’ 18 రోజుల వసూళ్లు..టార్గెట్ కి అందుకోవడం కష్టమేనా?
తద్వారా సూర్య ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా సినిమా ఇండస్ట్రీలో ఆయన స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ రెండు సినిమాలను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగులో నాని నటించిన హిట్ 3 సినిమాకి మంచి బజ్ అయితే ఉంది.
ఇక ట్రైలర్ కూడా చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండడంతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సూర్య సినిమాకి కూడా మంచి అంచనాలు ఉన్నప్పటికి రీసెంట్ గా ఆయన చేసిన ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేక పోతుంది. కాబట్టి కొంత వరకు తెలుగులో ఆయన మార్కెట్ అయితే డౌన్ అయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు.
తద్వారా విజయాన్ని అందుకోబోతున్నాడా లేదా అంటూ ప్రతి ఒక్కరిలో కొన్ని రోజుల నుంచి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తు తున్నాయి. మరి ఈ సినిమాతో వాటన్నింటికి సమాధానం చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ మూవీ మీద అంచనాలైతే పెద్దగా లేకపోయినప్పటికి ఈ సినిమా మొదటి షో తో పాజిటివ్ టాక్ ను కనుక సంపాదించుకున్నట్లయితే యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?