Good Bad Ugly Movie : తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్(Thala Ajith Kumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తూ రోజుకో రికార్డుని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఫుల్ రన్ లో 250 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మూడవ వీకెండ్ లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో గ్రాస్ వసూళ్లు రాలేదు. మూడవ వీకెండ్ మొత్తం కలిపి ఈ చిత్రానికి కేవలం 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి 18 రోజులకు గాను 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తమిళనాడు లో కూడా ఈ చిత్రం ఫుల్ రన్ లో ‘అమరన్’ కంటే తక్కువ వచ్చేలా అనిపిస్తుంది.
Also Read : బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు రేపిన మోహన్ లాల్ ‘తుడారం’..3 రోజుల్లో ఎంత వచ్చిందంటే!
అమరన్ చిత్రానికి ఫుల్ రన్ లో తమిళనాడు ప్రాంతం నుండి 165 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 148 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇక ఎంత వసూళ్లు రాబట్టాలన్నా ఈ నాలుగు రోజులోనే రాబట్టాలి, ఎందుకంటే ఆ తర్వాత సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా పై తమిళనాడు లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. బుకింగ్స్ బాగుండడంతో అత్యధిక షోస్ ఆ సినిమాకే కేటాయిస్తున్నారు. ఫలితంగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి షోస్ భారీగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. నాల్గవ వారం లో చెన్నై సిటీ లో కనీసం 80 షోస్ ని అయినా సొంతం చేసుకుంటుందో లేదో.
దీంతో తమిళనాడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ క్లోజింగ్ 160 కోట్ల రూపాయిల లోపే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ‘రెట్రో’ చిత్రానికి పాజిటివ్ టాక్ రాకపోతే, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అమరన్ ని దాటే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 66 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 50 లక్షలు, కేరళ రాష్ట్రం నుండి నాలుగు కోట్లు, కర్ణాటక రాష్ట్రం నుండి 14 కోట్ల 35 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా 241 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 118 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గానే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, బయ్యర్స్ కి ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది. ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది కేవలం ‘రెట్రో’ ఫలితం పై ఆధారపడుంది.
Also Read : రీ రిలీజ్ కి సిద్దమైన బాహుబలి..మరోసారి చరిత్ర సృష్టిస్తుందా?