Homeఎంటర్టైన్మెంట్Hit3 on OTT Released : నాని హిట్ 3 ఓటీటీలో, అధికారిక ప్రకటన, ఎక్కడ...

Hit3 on OTT Released : నాని హిట్ 3 ఓటీటీలో, అధికారిక ప్రకటన, ఎక్కడ చూడొచ్చంటే?

Hit3 on OTT Released : నాచురల్ స్టార్ నాని హిట్ 3 మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ సిరీస్ లో మూడో చిత్రంగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. ఓపెనింగ్స్ సైతం పెద్ద మొత్తంలో హిట్ 3 రాబట్టింది. యూఎస్ లో నాని మరోసారి సత్తా చాటాడు. మరోసారి వన్ మిలియన్ మార్క్ క్రాస్ చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. నాని కెరీర్లో 11 సార్లు వన్ మిలియన్ వసూళ్లు అందుకుని, మహేష్ బాబు తర్వాత ఆ ఫీట్ అందుకున్న హీరోగా రికార్డులకు ఎక్కాడు.

వరల్డ్ వైడ్ హిట్ 3 మూవీ రూ. 114 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ. 50 కోట్లకు పైగా షేర్ హిట్ 3 వసూలు చేసింది. నిర్మాతగా కూడా నాని సక్సెస్ అయ్యాడు. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హిట్ సిరీస్ ని నాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని హిట్ 3 రూపొందించారు. నానికి జంటగా శ్రీనిధి శెట్టి నటించింది. మే 1న హిట్ 3 థియేటర్స్ లోకి వచ్చింది. అయితే నాలుగు వారాలు ముగియకుండానే ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

Also Read : నిరుడు 41.. ఈ ఏడాది ఇప్పటికే 42.. ఐపీఎల్ లో పెను విధ్వంసం లాంటి రికార్డు ఇది!

హిట్ 3 ఓటీటీ విడుదలపై అధికారిక సమాచారం అందుతుంది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 29 నుండి నెట్ఫ్లిక్స్ లో హిట్ 3 స్ట్రీమ్ కానుంది. నాని ఫ్యాన్స్ కి ఇది క్రేజీ అప్డేట్ అనడంలో సందేహం లేదు. హిట్ 3 ఓటీటీ హక్కులను రూ. 60 కోట్లకు పైగా చెల్లించి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

హిట్ 3 కథ విషయానికి వస్తే… అర్జున్ సర్కార్(నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఒక బ్రూటల్ మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్న అర్జున్ సర్కార్ కి ఓ షాకింగ్ మేటర్ తెలుస్తుంది. 13 హత్యలు అదే తరహాలో వివిధ ప్రాంతాల్లో జరిగినట్లు తెలుసుకుంటాడు. ఈ మర్డర్స్ వెనుక ఎవరు ఉన్నారు? అర్జున్ సర్కార్ ఆ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి? అనేది మిగతా కథ..

RELATED ARTICLES

Most Popular