https://oktelugu.com/

Only Nani Touched NTR Record: ఎన్టీఆర్ రికార్డు ని టచ్ చేసిన ఏకైక హీరో నానీ ఒక్కడే

Only Nani Touched NTR Record: టాలీవుడ్ లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇటీవలే ఆయన #RRR సినిమా తో డబుల్ హ్యాట్రిక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..టెంపర్ సినిమా నుండి ఆయనకీ ఒక్క ఫ్లాప్ కూడా తగలలేదు..అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళను ఏ మాత్రం నిరాశ పర్చకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు..పవన్ కళ్యాణ్ తర్వాత నేటి తరం స్టార్ హీరోలలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 20, 2022 / 01:40 PM IST
    Follow us on

    Only Nani Touched NTR Record: టాలీవుడ్ లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇటీవలే ఆయన #RRR సినిమా తో డబుల్ హ్యాట్రిక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..టెంపర్ సినిమా నుండి ఆయనకీ ఒక్క ఫ్లాప్ కూడా తగలలేదు..అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళను ఏ మాత్రం నిరాశ పర్చకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు..పవన్ కళ్యాణ్ తర్వాత నేటి తరం స్టార్ హీరోలలో వరుసగా 6 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందుకున్నాడు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే..ఇక USA లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఒక అరుదైన రికార్డు ఉంది..ఇప్పటి వరుకు ఆయన నటించిన సినిమాలలో 7 సినిమాలు USA లో 1 మిలియన్ మార్కుని అందుకున్నాయి..సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత అత్యధిక 1 మిలియన్ సినిమాలు ఎన్టీఆర్ కి మాత్రమే ఉన్నాయి..ఎన్టీఆర్ తర్వాతి స్థానం లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు..ఈయన నటించిన సినిమాలలో 6 సినిమాలు ఇక్కడ 1 మిలియన్ మార్కుని అందుకున్నాయి..ఇప్పుడు హీరో నాని పవన్ కళ్యాణ్ రికార్డు ని దాటి వేసి ఎన్టీఆర్ తో సరిసమానంగా 7 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన హీరో గా సరికొత్త రికార్డుని సృష్టించాడు.

    Nani, NTR

    Also Read: Ante Sundaraniki OTT Date: అంటే సుందరానికి OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఇటీవలే ఆయన హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా USA లో 1 మిలియన్ మార్కుని అందుకుంది..ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచినప్పటికీ USA లో మాత్రం యావరేజి గా నిలబడింది..గతం లో ఆయన హీరో గా నటించిన ఈగ, భలే భలే మొగాడివోయ్,MCA , నేను లోకల్, నిన్నుకోరి,జెర్సీ సినిమాలు 1 మిలియన్ మార్కుని అందుకున్నాయి..ఈ రేర్ ఫీట్ కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేకపోవడం విశేషం..నాని సినిమాలు ఇక్కడ ఎలా ఆడిన ఓవర్సీస్ ప్రాంతం లో మాత్రం ఆయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది అనే దానికి నిదర్శనమే అంటే సుందరానికి సినిమా వసూళ్లు..ఈ చిత్రం ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరుకు అన్ని ప్రాంతాలలో నిరాశ పరచగా ఒక్క USA లో మాత్రం పర్వాలేదు అనిపించింది..ఈ చిత్రం USA హక్కులను అక్కడి బయ్యర్లు 13 లక్షల రూపాయలకు కొనుగోలు చెయ్యగా..ఈ సినిమా 11 లక్షల డాలర్లు వసూలు చేసింది..ఇప్పటికి రన్ కొనసాగుతూ ఉండడం తో ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్స్ ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది.

    Ante Sundaraniki

    Also Read: Lady Contestant Blackmailed: బ్లాక్ మెయిల్ చేసి మరీ జబర్ధస్త్ కొచ్చిన ఆ లేడీ కంటెస్టెంట్

    Tags