Hit 4 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయడానికి చూస్తున్న నటుడు నాని (Nani)… కెరియర్ మొదట్లో మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రీసెంట్ గా చేసిన హిట్ 3 సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నప్పటికి నాని ఇంతకుముందు సినిమాలు చాలా సాఫ్ట్ గా ఉండటం వల్ల దానికి దీనికి పొంతన సరిగ్గా కుదరడం లేదంటూ కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం నాని మాస్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వరసగా మాస్ సినిమాలను చేసుకుంటూ జనాలకి తను మాస్ హీరో అంటూ నిదానంగా ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం లో ప్యారడైజ్ (Paradise) అనే సినిమా చేయబోతున్నాడు.
Also Read : ‘హిట్ 4’ సెట్స్ మీదకి వచ్చేది అప్పుడేనా..?
ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక హిట్ సినిమా ఫ్రాంచైజ్ ను కొనసాగిస్తూ హిట్ 4 సినిమా కూడా రాబోతుందనే విషయాన్ని మనకు తెలియజేశారు. ఇక హిట్ 4 లో
తమిళ స్టార్ హీరో అయిన కార్తీ (Karthi) నటించబోతున్నాడు.
శైలేష్ కొలన్ (Shailesh Kolan) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నాని ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నాడట. ఒక కేసు విషయంలో కార్తీ కి సహాయం చేసే పాత్రలో నాని హిట్ 4 క్లైమాక్స్ లో వచ్చి అతన్ని ఆదుకుంటాడట… మొత్తానికైతే నాని హిట్ 4 లో కూడా కనిపించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
కార్తీ తనదైన రీతిలో హిట్ 4 మూవీని ముందుకు నడిపిస్తూ ఈ సిరీస్ ని సక్సెస్ ఫుల్ గా మార్చే ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ప్రస్తుతం శైలేష్ కొలన్ వెంకటేష్ తో ఒక సినిమా చేసిన తర్వాత హిట్ 4 సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. మరి ఏది ఏమైనా కూడా ఈ సిరీస్ లో భాగంగా ఇప్పుడు రాబోతున్న హిట్ సిరీస్ లన్నీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి శైలేష్ కొలన్ ను స్టార్ డైరెక్టర్ గా మార్చబోతున్నాయి.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?