Hit 3 : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మారిపోయాయి ప్రతి ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమా పాన్ ఇండియా సినిమాగా రావడమే కాకుండా ప్రేక్షకులందరికి ఒక త్రీ ఫీల్ ఇస్తూ సూపర్ సక్సెస్ ని సాధించడంలో కూడా కీలకపాత్ర వహిస్తున్నాయి ముఖ్యంగా తెలుగు సినిమాలు అయితే భారీ విజయాలను సాధిస్తున్నాయి… ఇక ఇప్పటివరకు మన హీరోలు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట వాళ్ళు చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోల్లో నాని ఒకరు…ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరో నాని…నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా మారడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఇంతకుముందు చేసిన దసర (Dasara) సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసినప్పటికి ఆ సినిమా పాన్ ఇండియాలో పెద్దగా ఆడలేదు. ఇక దాంతో ఇప్పుడు ‘హిట్ 3’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని ఈసారి మాత్రం తప్పకుండా పాన్ ఇండియా సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.
Also Read : హిట్ 3 మీద బజ్ మామూలుగా లేదుగా మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందంటే..?
ఇక మే ఒకటోవ తేదీన శైలేష్ కొలన్ (Shailesh Kolan) డైరెక్షన్ లో చేసిన హిట్ 3 సినిమా మే 1 వ తేదీన రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు… దీనికి ముఖ్య అతిథిగా రాజమౌళి (Rajamouli) రావడం అందరిని ఆకర్షించింది… ఇక ఈ సినిమా గురించి నాని చాలా గొప్పగా చెప్పాడు. ఈ సినిమా చేస్తున్నంత సేపు తనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందని ఇండస్ట్రీలో తనను తాను నిలదోక్కుకున్న తీరు అలాగే తనను ప్రేక్షకులు ఆదరించిన తీరు చాలా గొప్పవని సినిమా కోసం తను ఏదైనా చేస్తానని చెప్పడం విశేషం…
ఇక ఈ సినిమాలో కొన్ని సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని వాటిని చూసిన ప్రేక్షకులందరూ థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పడం విశేషం…ఇక దానికి తోడుగా చివర్లో ఈ సినిమాకు మీద తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని తెలియజేయడానికి ఒక డైలాగ్ ని చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆయన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) చెప్పినటువంటి ‘మనల్ని ఎవడ్రా ఆపేది’…
అనే డైలాగ్ ను వాడుతూ తన సినిమాని ప్రమోషన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ డైలాగులు విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం నాని సినిమాని చూసి సూపర్ సక్సెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి ఏది ఏమైనా కూడా మే 1వ తేదీన ఈ సినిమాని గ్రాండ్ సక్సెస్ గా నిలపడానికి ప్రేక్షకులు సైతం ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్..ట్రెండ్ ఎలా ఉందంటే!