Chiranjeevi – Srikanth Odela : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే సీనియర్ హీరోలు సైతం పెను ప్రభంజనాలను సృష్టిస్తూ వాళ్లకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లాంటి నటుడు సైతం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఒకప్పుడు తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నప్పటికి, అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్తదనాన్ని పరిచయం చేశాడు. మరి ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలను ఎంచుకుంటూ మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం వశిష్ట (Vashishta) డైరెక్షన్లో చేస్తున్న విశ్వంభర (Vishwambhara) సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాల తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో భారీ సినిమాని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Also Read : చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో…
మరి శ్రీకాంత్ ఓదెల లాంటి యంగ్ డైరెక్టర్ చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి మంచి ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఇక దానికి తోడుగా ప్రస్తుతం నానితో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా కనుక సూపర్ డూపర్ సక్సెస్ సాధించినట్టయితే చిరంజీవితో చేయబోయే సినిమా మీదకి భారీ అంచనాలైతే పెరుగుతాయి. మరి ఆ అంచనాలకు పెంచుకోవాలంటే శ్రీకాంత్ ఓదెల నాని సినిమా కోసం చాలా కష్టపడి అయిన సరే ఆ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిని ఎవ్వరూ చూపించనంత గొప్ప రేంజ్ లో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) చూపించబోతున్నాడట… ఇక ఈ సినిమాలో ఒక క్యామియో రోల్ కూడా ఉందట. దాన్ని రజనీకాంత్ చేత చేయిస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు రాబోయే సినిమాలతో భారీ విజయాన్ని అందుకొని చిరంజీవి సినిమాను సైతం ఇండస్ట్రీ హిట్ గా నిలపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
Also Read : చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి రక్తంతో తడిపేశారు..ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొడుతుందా..?