Mahesh Babu And Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్(Pavan Kalya)… ఆయన చేసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. నిజానికి ఆయన సినిమాలు చేయడమే కాకుండా చాలా సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉంటాడు. దానివల్ల ఆయనకు వ్యక్తిగతంగా కూడా అభిమానులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు పొలిటిషన్ గా ఇటు హీరోగా రెండు వైవిధ్యమైన బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబ(Mahesh Babu) సైతం స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో వరల్డ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఇక ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకులను మెప్పించి హాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తాడు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు… ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరూ కూడా మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఒకానొక సమయంలో వీళ్ళిద్దరూ కలిసి ఒకే దర్శకుడితో ఒకే టైం లో సినిమా చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందట. పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ(Tholi prema) సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందించిన కరుణాకరన్ (Karunakaran) ఆ తర్వాత యువకుడు (Yuvakudu) సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కరుణాకరన్ మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు.
ఇక అదే సమయంలో మహేష్ బాబు సైతం కరుణాకరన్ తో ఒక సినిమా చేయాలని వాళ్ళ నాన్న కృష్ణ గారిని కోరాడట. ఇక ఆ సమయంలో కృష్ణ కరుణాకర్ ని పిలిపించి మహేష్ తో ఒక సినిమా చేయమని అడిగినట్టుగా కూడా అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి.
ఇక అప్పటికే పవన్ కళ్యాణ్ సైతం మరోసారి కరుణాకరన్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. దాంతో మహేష్ బాబు ప్రస్తుతానికి ఆయన చేస్తున్న సినిమాలను కంటిన్యూ చేసి కరుణాకరన్ తో సినిమా చేయాలనుకున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ సైతం కరుణాకరన్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడేమో అనుకొని ఆయన కూడా కరుణాకరన్ తో తర్వాత సినిమా చేద్దామని వేరొక సినిమాలో బిజీ అయిపోయాడట. ఇక మొత్తానికైతే కరుణాకర్ ఆ సమయంలో వీరిద్దరితో కాకుండా వేరే హీరోతో సినిమా చేయాల్సి వచ్చింది. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరూ కూడా ఒకే సమయంలో ఒకే దర్శకుడితో సినిమా చేయాలని అనుకోవడం అప్పట్లో హాట్ టాపిగ్గా మారింది…