Homeఎంటర్టైన్మెంట్Hit 3 OTT: హిట్ 3 ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

Hit 3 OTT: హిట్ 3 ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

Hit 3 OTT: నాని కెరీర్లో మోస్ట్ వైలెంట్ మూవీగా హిట్ 3 తెరకెక్కింది. దర్శకుడు శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో హిట్ 3 మూడో సినిమా. హిట్ సిరీస్ ని హీరో నాని స్వయంగా నిర్మిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా పేరుతో నాని బ్యానర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థలో 2020లో హిట్ నిర్మించాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ విజయం సొంతం చేసుకుంది. హిట్ 2లో అడివి శేష్ నటించాడు. ఇది కూడా ప్రేక్షకుల ఆదరణ రాబట్టింది.

Also Read: ‘జైలర్ 2’ లో 15 నిమిషాలు కనిపించనున్న బాలయ్య..రెమ్యూనరేషన్ ఎంతంటే!

ఇక హిట్ 3లో నాని నటించాడు. ఏసీపీ అర్జున్ సర్కార్ రోల్ లో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేశాడు. మోస్ట్ వైలెంట్ ఆఫీసర్ రోల్ చేశాడు నాని. మే 1న హిట్ 3 థియేటర్స్ లో విడుదల చేశారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. వసూళ్లపరంగా సత్తా చాటుతుంది. హిట్ 3 ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఆశాజనకంగా ఉన్నాయి. దాంతో యూనిట్ సంబరాలు జరుపుకుంటుంది.

హిట్ 3 చిత్రానికి ఓటీటీ రూపంలో కూడా భారీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తుంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఫ్యాన్సీ ధర చెల్లించి హిట్ 3 హక్కులు దక్కించుకుందట. అందుతున్న సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ హిట్ 3 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. అందుకు రూ. 54 కోట్ల వరకు చెల్లించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బడ్జెట్ లో మూడొంతులు డిజిటల్ రైట్స్ ద్వారానే నిర్మాత నాని రాబట్టారు. ఇటీవలే నాని కోర్ట్ టైటిల్ తో చిన్న సినిమా నిర్మించి పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించాడు.

ఇక హిట్ 3 కథ విషయానికి వస్తే.. అర్జున్ సర్కార్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్. తప్పు చేసిన వారిని క్షమించకూడదు. మరలా తప్పు చేయాలంటే భయపడాలి అనే సిద్ధాంతం ఫాలో అవుతాడు. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన అర్జున్ సర్కార్ కఠినమైన హృదయం కలిగిన అధికారిగా మారుతాడు. అర్జున్ సర్కార్ కి ఓ కేస్ సవాల్ విసురుతుంది. సిటీలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యల వెనక ఉన్నది ఎవరు? వారి లక్ష్యం ఏమిటీ? ఆ కిల్లర్ ని అర్జున్ సర్కార్ ఎలా పట్టుకున్నాడు? అనేది కథ..

Also Read: 49 ఏళ్ల వయస్సులో పెళ్లికాకుండా ఒంటరిగా.. ఒకప్పుడు 12 మందితో ప్రేమాయణం.. కానీ ప్రస్తుతం ఇలా..

Exit mobile version