Hit 3 : నాని కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఆయన గత రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దసరా చిత్రంలో డీగ్లామర్ రోల్ లో మెప్పించాడు. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా దసరా నిలిచింది. హాయ్ నాన్న చిత్రంతో మరో హిట్ కొట్టాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్, ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన హిట్ 3 మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో హిట్ 3 మూడో చిత్రం. విశ్వక్ సేన్, అడివి శేష్ మొదటి రెండు చిత్రాల్లో హీరోలుగా నటించారు.
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని స్వయంగా హిట్ 3 నిర్మిస్తున్నాడు. ఇటీవల హిట్ 3 టీజర్ విడుదల చేశారు. హిట్ 3లో నాని క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉంది. వైలెన్స్ ఊహకు మించి ఉంది. నాని గతంలో ఎన్నడూ చేయని యాంగ్రీ , రూత్లెస్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నాడు. హిట్ 3 సమ్మర్ కానుకగా మే 1న విడుదల కానుంది. కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే హిట్ 3 మూవీ చూడొద్దు అంటూ నాని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకు కారణం పరిశీలిస్తే..
Also Read : ‘హిట్ 3’ టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్..24 గంటల్లో బీభత్సం..నాని ఇక స్టార్ హీరోల లీగ్ లోకి వచ్చినట్టే!
ప్రియదర్శి ప్రధాన పాత్రలో కోర్ట్ టైటిల్ తో ఒక మూవీని నాని నిర్మించాడు. సాయి కుమార్, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, రోహిణి ఇతర కీలక రోల్స్ చేశారు. ఈ మూవీ మార్చి 14న విడుదల కానుంది. హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. కోర్ట్ చిత్రానికి నిర్మాతగా ఉన్న నాని వేడుకకు హాజరయ్యాడు. వేదికపై మాట్లాడుతూ… నేను పరిశ్రమకు వచ్చి 16 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్లలో నా సినిమా చూడమని వేడుకుంది లేదు. మొదటిసారి కోర్ట్ సినిమా చూడండి అని తెలుగు ప్రేక్షకులను అడుగుతున్నాను.
నేను ఈ సినిమాకు నిర్మాతను కాబట్టి సినిమా చూడాలని అడగడం లేదు. ఒక మంచి సినిమా జనాలకు చేరాలనే ఉద్దేశంతో అంటున్నాను. కోర్ట్ సినిమా బడ్జెట్ కి పదిరెట్లు ఎక్కువ హిట్ 3 సినిమాకు ఖర్చు చేశాను. కోర్ట్ మూవీ మీ అంచనాలు అందుకోకపోతే హిట్ 3 చూడొద్దు, అన్నారు. నిజానికి ఇది ఒక సాహసోపేతమైన స్టేట్మెంట్. మరి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో పోక్సో(POCSO) చట్టం తెచ్చారు. ఈ కఠిన చట్టంలోని లోపాలను ఎత్తి చూపేలా కోర్ట్ మూవీ తెరకెక్కింది అన్నట్లు ట్రైలర్ ఉంది.
Also Read : ఇంత అతి అవసరమా..? పోలీసులు ఎక్కడైనా ఇలా ఉంటారా..? లెక్క తప్పుతున్న నాని ‘హిట్ 3’ మూవీ!