Court Movie VS Chhaava Movie : తక్కువ బడ్జెట్, చిన్న నటీనటులతో తీసే కొన్ని సినిమాలు ఈమధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా విడుదలైన ‘కోర్ట్'(Court Movie) చిత్రం కూడా ఆ కోవకు చెందినదే. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు. తెలుగు ఆడియో తో పాటు, హిందీ, తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన రోజునే బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘చావా'(Chhaava Movie) చిత్రం కూడా ఓటీటీ లోకి వచ్చింది. అయితే ఇది కేవలం తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మొదట్లో ‘చావా’ చిత్రమే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ డామినేషన్ ని చూపించింది.
Also Read : జోరు తగ్గని ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..12వ రోజు వచ్చిన వసూళ్లు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కానీ గత రెండు రోజుల నుండి కోర్ట్ చిత్రం నెంబర్ 1 స్థానంలోకి అడుగుపెట్టి, చావా చిత్రాన్ని రెండవ స్థానానికి నెట్టేసింది. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఒక బాలీవుడ్ చారిత్రాత్మక చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద 720 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన వెండితెర అద్భుతాన్ని ‘కోర్ట్’ లాంటి చిన్న చిత్రం డామినేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. తెలుగు ఆడియన్స్ తో పాటు, హిందీ ఆడియన్స్ ఈ సినిమాని అత్యధికంగా వీక్షిస్తున్నారు. అందుకే ఈ స్థాయిలో డామినేషన్ చూపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఆరంభం నుండి చివరి వరకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా, ఉత్కంఠభరితంగా సాగడంతో ఈ సినిమాకు నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ వంద శాతం పాజిటివ్ అయితే, ఓటీటీ నుండి వస్తున్న రెస్పాన్స్ 200 శాతం పాజిటివ్ గా ఉంది.
‘చావా’ చిత్రాన్ని వెనక్కి నెట్టి ట్రెండ్ అవుతుందంటే, కచ్చితంగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లాంగ్ రన్ లో సంచలన రికార్డుని నెలకొల్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఏకంగా 15 వారాల పాటు ట్రెండ్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప 2’ చిత్రం 12 వారాల నుండి ట్రెండ్ అవుతుంది. ఇంకా ఎన్ని వారాలు ట్రెండ్ అవుతుందో చూడాలి. రీసెంట్ గా అయితే ఈ రెండు సినిమాలే నెట్ ఫ్లిక్స్ లో సునామీ ని సృష్టించాయి. ‘కోర్ట్’ చిత్రం ఈ రెండు సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి. విశ్లేషకుల అంచనా ప్రకారం అయితే కచ్చితంగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ రికార్డ్స్ ని కొడుతుందనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.