Hit 3 : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) నిన్ననే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకు అనకాపల్లి నుండి అమెరికా వరకు కళ్ళు చెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. నాని కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ ని సొంతం చేసుకున్న సినిమా ‘దసరా’. మళ్ళీ ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని నాని ఇప్పట్లో అందుకోలేడు ఏమో అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ, ఇంత తక్కువ సమయంలో ఈ ‘దసరా’ ని మించిన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. నిన్న సక్సెస్ మీట్ లో కూడా నైజాం ప్రాంతం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో దసరా ని కొట్టిందని చెప్పుకొచ్చాడు.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఏకంగా 38 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. యంగ్ జెనెరేషన్ హీరోలలో ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు అని అంటున్నారు. కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి మొదటి రోజు 4 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నాని గత చిత్రాలకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి వచ్చే వసూళ్లు ఇవి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఏకంగా కోటి 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఈ రెండు ప్రాంతాల నుండే ఈ చిత్రానికి 5.75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలను కూడా కలిపి చూస్తే మొదటి రోజు షేర్ 15 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది.
నాని ‘దసరా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి కోటి అదనంగా రావడం విశేషం. ఇక ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఏకంగా 8 లక్షల 68 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. కేవలం నార్త్ అమెరికా లో మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, బ్రిటన్, గల్ఫ్ మరియు ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్ వచ్చింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 38 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. కేవలం వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఈ సినిమాకు ఎక్కువగా ఉన్నాయి.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?