Kantara Gods: 2022వ సంవత్సరంలో వచ్చిన ‘కాంతార’ సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించింది. అప్పటివరకు కర్ణాటక లోని తులినాడు ప్రాంతంలో పంజూర్లి, గులిగ అనే దేవతలు ఉన్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ ఒక్కసారి ఈ సినిమా రావడంతో నేషనల్ వైడ్ గా ఆ దేవుళ్ళు పాపులారిటిని సంపాదించుకున్నారు. ఇక కాంతార క్లైమాక్స్ సీన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందనే చెప్పాలి. అప్పటి వరకు అలాంటి ఒక క్లైమాక్స్ సీన్ ఎవరు చూసి ఉండరు. ఆ సినిమా వచ్చిన తర్వాత దాన్ని రిఫరెన్స్ తో చాలా సినిమాలు అలానే వచ్చినప్పటికి ఆ సినిమాను బీట్ చేసే సినిమా మాత్రం రాలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక కాంతార సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో కాంతార మూవీ కి ప్రీక్వెల్ తీయాలని కాంతార చాప్టర్ 1 పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఇక రీసెంట్ గా దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…పంజుర్లి, గులిగ అనే దేవతా గురించి ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు…
పంజుర్లి వరాహ రూపంలో ఉండే సంరక్షణ ఆత్మ… గులిగ ప్రకృతిని కాపాడే దేవుడు…వీళ్ళు భూతకోలతో పూజలందుకుంటారు…కర్ణాటకలోని తులినాడు ప్రాంతంలో దాదాపు 5000 సంవత్సరాల నుంచి ఈ దేవుళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది…అప్పటివారు వీళ్ళను ‘భూత పూజ’ అని పిలిచి వారు…మన వాడుక భాషలో భూతాలు అంటే చెడు ఆత్మలను, దెయ్యాలని అనుకుంటాం…కానీ వాటికి వీటికి అసలు సంబంధం లేదు…ఎందుకంటే పంజుర్లి, గులిగా రెండు మంచిని కాపాడే దేవుళ్లు కావడం విశేషం… ప్రకృతిని కాపాడుతూ, మనుషులను రక్షిస్తూ గౌరవంగా బతికేవాళ్ళకి అండగా నిలుస్తుంటాయి…
నిజానికి పంజుర్లి దేవుడు ఎలా వెలిశాడు అనేది చాలా మంచి కథ…ఆ స్టోరీ ని కాంతారా మూవీ లో చూపించే ప్రయత్నం చేశారు…కైలాస పర్వతంలో అడవి పంది చనిపోయిన తర్వాత దాని పిల్ల అనాథ అవుతోంది…పార్వతి దేవి ఆ వరాహ బిడ్డ ను దత్తత తీసుకుంటుంది…అది తెలుసుకున్న శివుడు కోపానికి వచ్చి ఆ వరాహన్ని కైలాస పర్వతం నుంచి బహిష్కరిస్తాడు…ఇక అప్పటికే పార్వతి దేవి ప్రేమ తో ఆ వరాహం పంజుర్లి గా మారి అడవులను రక్షిస్తోంది…
గులిగ అవతారం కూడా చాలా గొప్ప గా ఉంటుంది…పంజుర్లి పార్వతి దేవి ప్రేమతో ఉద్భవిస్తే, గులిగ మాత్రం ఆమె కోపం నుంచి పుట్టింది…విశ్వ వినాశనం సమయం లో శివుడు విసిరిన రాయి నుంచి గులిగ అవతరించింది…గులిగ న్యాయానికి ప్రతిరూపం…ఎక్కడైతే అన్యాయం ఉంటుందో దాన్ని అంతరించేందుకు విష్ణు వరం వల్ల గులిగ అక్కడ ప్రత్యేకమవుతోంది…
ఇక ఈ రెండు దేవుళ్ళ గురించి కాంతార లో గొప్పగా చూపించారు… రిషబ్ శెట్టి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు…తనే డైరెక్టర్ గా, హీరోగా చేయడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…