YouTuber Anvesh traitor: నా అన్వేషణ(Naa Anveshana), ప్రపంచ యాత్రికుడు(Prapancha Yatrikudu) యూట్యూబ్ చానెల్స్ ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అన్వేష్ ని ఇప్పుడు పోలీసులు శిక్షిస్తే కానీ జనాలు శాంతించేలా కనిపించడం లేదు. అతని పై జనాలకు ఉన్న కోపం చూస్తుంటే, అతను కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నారు. నోటి దూలతో అతను మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ని అరికట్టడం లో, ప్రజలకు దీని వల్ల జరిగే నష్టాలను వివరించడం లో అన్వేష్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అందుకు జనాలు కూడా ఇతనికి బాగా సపోర్ట్ చేశారు. కానీ ఆ సమయం లోనే అతను నోరు జారీ మాట్లాడడం పై తప్పుబట్టారు. ఇక రీసెంట్ గా శివాజీ హీరోయిన్స్ దుస్తులపై చేసిన కామెంట్స్ ని తప్పుబడుతూ, హద్దులు దాటి మరీ దూషించాడు. అంతటితో ఆగకుండా హిందూ దేవుళ్ళ వరకు తీసుకెళ్లాడు.
అతను చేసిన ఈ వ్యాఖ్యల వల్ల నాలుగు లక్షలకు పై జనాలు ఆయన చానెల్స్ ని అన్ ఫాలో కొట్టడం మొదలు పెట్టారు. చరిత్ర లో ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కి కూడా ఇలా జరగలేదు. ఇక హిందూ సంఘాలు అయితే అన్వేష్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి ఇప్పటికే అతనిపై కేసులు నమోదు అయ్యాయి. దేవతలను దూషించిన అన్వేష్ ని వెంటనే దేశానికీ రప్పించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే దేశద్రోహి గా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యం లో ప్రముఖ సినీ నటి, బీజేపీ పార్టీ నాయకురాలు కరాటీ కళ్యాణి అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్స్ ద్వారా కేసులను నమోదు చేయించింది. త్వరలోనే అన్వేష్ కి నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు చెప్పుకొచ్చారు.
అయితే అన్వేష్ ని పోలీసులు మన దేశానికీ తిరిగి రప్పిస్తారా ? అంటే అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. పోలీసులు విదేశాలకు వెళ్లి మరీ అన్వేష్ ని పెట్టుకోవాలంటే, చాలా ఖర్చు తో కూడుకున్న పని. అందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఫండ్స్ కేటాయించాలి. ప్రభుత్వాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమయం లో అన్వేష్ గురించి పట్టించుకుంటుందా?, ప్రాక్టికల్ గా అలోచించి చూడండి. అన్వేష్ అనే వ్యక్తి ఇండియా కి స్వయంగా వస్తే తప్ప, అతను పోలీసులకు దొరకడం అసాధ్యం. ఇండియా కి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందో అన్వేష్ కి బాగా తెలుసు, అందుకే అతను ఇండియా కి ససేమీరా రాను అని అంటున్నాడు.