Allu Arjun Request Rejected: 2024, డిసెంబర్ 4 న హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్నటువంటి సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్ని ఇబ్బందులను ఎదురుకున్నాడో అందరికీ తెలిసిందే. పోలీసులు ఆయన్ని ఈ ఘటన కారణంగా అరెస్ట్ కూడా చేశారు. రేవతి అనే మహిళా చనిపోవడం , ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం వంటివి తల్చుకుంటే , ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. పగోడికి కూడా అలాంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదు అని కోరుకున్న సందర్భాలు అవి. కాలం గడిచేకొద్దీ జనాలు ప్రతీ విషయాన్ని మర్చిపోతుంటారు. అలా ఈ సంఘటన ని కూడా చిన్నగా మర్చిపోవడం మొదలు పెట్టారు జనాలు. అయితే నేడు నాంపల్లి హై కోర్టు అల్లు అర్జున్ కి ఊహించని షాక్ ఇచ్చింది.
ఈ ఘటనలో అల్లు అర్జున్ తో పాటు, 18 మందిని నిందితులుగా గుర్తించి నాంపల్లి హై కోర్టు నేడు సమన్లు పంపింది. వచ్చే సోమవారం , అనగా జూన్ 22 న కచ్చితంగా హైకోర్టు కి వచ్చి విచారణకు హాజరవ్వాలని అల్లు అర్జున్ ని హైకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ ఆరోజు తానూ ముంబై లో ‘రాకా’ మూవీ షూటింగ్ లో ఉంటానని, ఆ ఒక్క రోజు వ్యక్తిగత విచారణ కాకుండా, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణ ఉండేలా ప్లాన్ చేయాల్సిందిగా హై కోర్టు కి అల్లు అర్జున్ రిక్వెస్ట్ పిటీషన్ ని పెట్టుకున్నారు. అయితే ఈ పిటీషన్ ని రిజెక్ట్ చేసిన హైకోర్టు , ఎట్టి పరిస్థితి లోనూ ఈ నెల 22 న హై కోర్టు కి రావాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఈ విచారణకు సోమవారం రోజున వస్తాడా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒకవేళ అల్లు అర్జున్ రాకపోతే న్యాయపరమైన చర్యలు ఉంటాయా?, పోలీసులు మరోసారి ఆయన్ని అరెస్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క ఈ ఘటన లో అపస్మారక పరిస్థితిలోకి వెళ్లిన శ్రీతేజ్ , ఇప్పుడు తన ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు కానీ , మనుషులను గుర్తించలేకపోతున్నాడు , అన్నం తినడం కూడా అతనికి చాలా ఇబ్బందిగా ఉంది. ఓవరాల్ గా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ దురభిమానులు , అల్లు అర్జున్ ని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
