Mangalavaram Movie: మంగళవారం సినిమాకు హై బడ్జెట్.. పాయల్ రాజ్ పుత్ ఈ మొత్తాన్ని రికవరీ చేస్తుందా

ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత మరో హిట్ ను సొంతం చేసుకోలేకపోయారు అజయ్ భూపతి. బోల్డ్ లవ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసిన మరో సినిమా తీయడంలో విఫలం అయ్యాడు.

Written By: Suresh, Updated On : November 14, 2023 3:31 pm

Mangalavaram Movie

Follow us on

Mangalavaram Movie: ఉప్పెన, ఆర్ఎక్స్ 100 సినిమాలు చిన్న సినిమాలుగానే వచ్చి హిట్ ను సాధించాయి. బోల్డ్ కంటెంట్ తో వచ్చి యూత్ ను ఆకట్టుకున్నాయి ఈ సినిమాలు. ఇక ఈ సినిమాల్లో నటించిన హీరోయిన్ ల క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. అయితే కృతి శెట్టి తన టాలెంట్ తో ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకొని పోయింది. ఇటు పాయల్ కూడా అదే రేంజ్ లో దూసుకొని పోయింది. ఇక ఆర్ ఎక్స్ 100 సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ భూపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతోనే హిట్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు.

ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత మరో హిట్ ను సొంతం చేసుకోలేకపోయారు అజయ్ భూపతి. బోల్డ్ లవ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసిన మరో సినిమా తీయడంలో విఫలం అయ్యాడు. ఈ సినిమా తర్వాత మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించారు కానీ ఆ సినిమా బోల్తా కొట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అవడంతో డీలా పడ్డాడు ఈ డైరెక్టర్. కానీ ప్రయత్నం ఆపకుండా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ డైరెక్టర్ మరో సారి పాయల్ రాజ్ పుత్ నే నమ్మకున్న మంగళవారం అనే సినిమాతో త్వరలోనే సందడి చేయనున్నాడు.

ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి మంచి హైప్ క్రియేట్ అయింది. సౌత్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్దమైంది. ఈ సినిమా కోసం ఎందరో ఎదురుచూస్తున్నారు కూడా. అయితే ఈ సినిమాకు ఎక్కువ బడ్జెట్ ను కెటాయించారు అని టాక్. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 20 కోట్లు ఖర్చు చేశారట. స్టార్లు లేని ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో బడ్జెట్ అంటే హై రిస్క్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆర్ ఎక్స్ 100 సినిమాతో అంచనాలను మించి సక్సెస్ అందుకుంది పాయల్. ఇక ఆమెపైనే హోప్స్ పెట్టుకొని మరోసారి లక్ ను పరీక్షించుకోవాలి అనుకుంటున్నారట అజయ్ భూపతి.

కాంతార సినిమాకు మ్యూజిక్ అందించిన డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారట. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. మరోవైపు పాయల్ మీదనే ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ ఆధారపడి ఉందని తెలుస్తోంది. మరి ఆర్ ఎక్స్ 100 లాంటి హిట్ ను ఈ కాంబోతో రిపీట్ చేస్తారో లేదో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.