https://oktelugu.com/

Annamalai : అన్నామలై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గింజుకుంటున్న ద్రవిడ వాదులు

అన్నామలై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గింజుకుంటున్న ద్రవిడ వాదులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2023 / 03:38 PM IST

    Annamalai : తమిళనాడులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దేవాదాయ శాఖనే దేవాలయాలను ధ్వంసం చేస్తోంది. ఒకవైపు ఎప్పటి నుంచో దేవాలయాలను ప్రభుత్వం నుంచి విడుదల చేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. జగ్గూ వాసుదేవ్ లాంటి వారు ఇదే డిమాండ్ చేస్తున్నారు. అయినా దేవాదాయ శాఖ తన పద్ధతిని మాత్రం మార్చుకోవడం లేదు.

    దేవాలయాల వద్ద పెరియార్ విగ్రహాలను కూలుస్తామని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై చేసిన ప్రకటన పెను సంచలనమైంది. తమిళనాట సమాజం రెచ్చిపోయింది. పత్రికా విలేకరుల సమావేశంలో జర్నలిస్టులందరూ అన్నామలైను ప్రశ్నించారు. పెరియార్ మాకు దేవుడు.. ఆయన గురించి ఇలా ఏలా మాట్లాడుతారని నిలదీశారు.

    దీనికి అన్నామలై సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. ‘కమ్యూనిస్టులు తమ బతకడం కోసం ఇతరుల కాళ్లు, బూట్లు నాకుతారు’ అని పెరియార్ అన్నాడని.. మరి కమ్యూనిస్టుల ఆఫీసుల ముందు ఎందుకు పెరియార్ విగ్రహాలను పెట్టారని అన్నామలై విలేకరులను ప్రశ్నించాడు. కాంగ్రెస్ సమూలంగా నాశనమైపోవాలని పెరియార్ అన్నారని.. కాంగ్రెస్ ఆఫీసుల ముందు ఎందుకు పెరియార్ ఆఫీసుల ముందు ఎందుకు ఉంచారని అన్నామలై ప్రశ్నించారు. ఇక డీఎంకే మనుషులు కొందరు వాళ్ల భార్యలనే అమ్మేస్తారని పెరియార్ అన్నారని.. మరి డీఎంకే ఆఫీసుల ముందు పెరియార్ విగ్రహాలను ఎలా పెడుతారు.

    అన్నామలై జవాబు ఎంత సూటిగా.. స్పష్టంగా ఉందంటే.. ‘పెరియార్ విగ్రహాలను దేవాలయాల ముందు మాత్రమే తీసేస్తానని.. ఆఫీసుల ముందు పెట్టుకోవచ్చని’ స్పష్టం చేశారు. పెరియార్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. ఒక నాస్తికుడు అయ్యి బ్రిటీష్ వారితో కలిసి పనిచేశాడని గుర్తు చేశారు.

    అన్నామలై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గింజుకుంటున్న ద్రవిడ వాదులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.