Hi Nanna Collection: హాయ్ నాన్న కలెక్షన్స్… విజయానికి చేరువలో హీరో నాని, ఎన్ని కోట్లు వచ్చాయంటే?

అనూహ్యంగా సెకండ్ డే నుండి వసూళ్లు పుంజుకున్నాయి. ఫస్ట్ వీకెండ్ హాయ్ నాన్న సత్తా చాటింది. ఫస్ట్ వీక్ పూర్తి చేస్తున్న హాయ్ నాన్న సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. నిన్న గురువారం హాయ్ నాన్న చిత్రానికి రెస్పాన్స్ బాగా పడిపోయింది.

Written By: NARESH, Updated On : December 15, 2023 11:45 am

Hi Nanna Collection

Follow us on

Hi Nanna Collection: హాయ్ నాన్న మూవీ విజయానికి చేరువైంది. నాని ఖాతాలో మరో క్లీన్ హిట్ పడనుంది. ఈ ఏడాది ఆయనకు బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. దసరా చిత్రంతో నాని కెరీర్ హైయెస్ట్ వసూళ్లు నమోదు చేశాడు. నాని డీగ్లామర్ రోల్ చేయగా ప్రేక్షకులు ఆదరించారు. దసరా విజయంతో జోరు మీదున్న నాని హాయ్ నాన్న అనే ఎమోషనల్ లవ్ డ్రామా చేశారు. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన హాయ్ నాన్న పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే డిజాస్టర్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి హాయ్ నాన్న ప్లాప్ అవుతుందని భావించారు.

అనూహ్యంగా సెకండ్ డే నుండి వసూళ్లు పుంజుకున్నాయి. ఫస్ట్ వీకెండ్ హాయ్ నాన్న సత్తా చాటింది. ఫస్ట్ వీక్ పూర్తి చేస్తున్న హాయ్ నాన్న సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. నిన్న గురువారం హాయ్ నాన్న చిత్రానికి రెస్పాన్స్ బాగా పడిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 50 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది.

వరల్డ్ వైడ్ హాయ్ నాన్న రూ. 75 లక్షల షేర్ అందుకుంది. దీంతో హాయ్ నాన్న ఎనిమిది రోజులకు రూ. 26 కోట్ల షేర్ రాబట్టింది. హాయ్ నాన్న బిజినెస్ లెక్కలు చూస్తే… నైజాంలో రూ. 8.50 కోట్లకు అమ్మారు. ఆంధ్రా, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలపి వరల్డ్ వైడ్ రూ. 27.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 29 కోట్ల టార్గెట్ తో హాయ్ నాన్న బరిలో దిగింది. కాబట్టి మరో రూ. 3 కోట్లు వస్తే సినిమా హిట్.

హాయ్ నాన్న క్లీన్ హిట్ కావాలంటే ఇంకా మూడు కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ వారం పెద్ద చిత్రాల విడుదల లేదు. కాబట్టి హాయ్ నాన్న ఈ వీకెండ్ క్యాష్ చేసుకునే అవకాశం కలదు. విజయానికి దగ్గరైన హాయ్ నాన్న నానితో పాటు చిత్ర యూనిట్ ని సంతోషంలో నింపింది. హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. నెక్స్ట్ నాని సరిపోదా శనివారం అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. వీరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ డిజాస్టర్ అయ్యింది. అయినా నాని మరో ఛాన్స్ ఇచ్చాడు.