Hey Bhagwan Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. స్టార్ హీరోలతో పోటీ పడుతూ యంగ్ హీరోలు సైతం కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుహాస్ లాంటి నటుడు డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ‘కలర్ ఫోటో’ లాంటి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. అప్పటినుంచి వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికి ఆయనకు ఆ రేంజ్ సక్సెస్ మాత్రం పడటం లేదు. ఇక ఇప్పుడు ‘హే భగవాన్’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ‘హే భగవాన్’ ట్రైలర్ ని కనక మనం చూసినట్లయితే సీనియర్ నరేష్, సుహాస్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. అయితే వీళ్ళు ఒక సీక్రెట్ బిజినెస్ అయితే చేస్తున్నారు. ఆ బిజినెస్ ఏంటి అనే విషయం మనకు ట్రైలర్ లో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు…
ఆ బిజినెస్ ఏంటో తెలిస్తే వాళ్ళను ఎవరు క్షేమించారనే చెబుతున్నారు. ఇక ఈ పాయింట్ క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది. ఇక ట్రైలర్లో సైతం ఆ బిజినెస్ ని హైలెట్ చేశారు. ఇక సినిమాలో శివాని నగరం హీరోయిన్ గా నటిస్తుంది. సుహాస్ తను ప్రేమించిన విషయం హీరోయిన్ కి చెప్పినప్పటికి ఆయన చేసే బిజినెస్ ఏంటో తెలిస్తే శివాని వల్ల నాన్నతో చెప్పి పెళ్ళికి ఒప్పిస్తానని చెబుతుంది.
అయిన కూడా సుహాస్ ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు. ఇక మొత్తానికైతే సుహాస్ తను చేస్తున్న బిజినెస్ ఏంటి అనేది తెలియాలన్న తను హీరోయిన్ ని దక్కించుకున్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలన్నా కూడా ఈ సినిమా చూడాల్సిందే.
మొత్తానికైతే వివేక్ సాగర్ ఈ సినిమాకి అద్భుతమైన బిజియం ను అందించినట్టుగా తెలుస్తుంది. ట్రైలర్లో ప్రతి సీన్ కూడా నవ్వులు పూయించే విధంగా ఉంది. కాబట్టి ఇదొక కామెడీ ఎంటర్ టైనర్ గా మనం అర్థం చేసుకోవచ్చు… సుహాస్ డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికి ఈ సినిమా కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…
