Tollywood Heroines: సినిమా రంగం అంటేనే అవకాశాలతో కూడుకున్నది. మంచి ఛాన్సులు వస్తేనే నిలదొక్కుకునేది. అయితే కొన్ని సార్లు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయాల్సి వస్తుంది. కాదంటే కష్టం అవుతుంది. ఇలా కాదనలేక.. ఒకప్పుడు హీరో పక్కన హీరోయిన్‌గా చేసి.. ఆ తర్వాత అదే హీరోకు తల్లి క్యారెక్టర్ చేసిన వారు ఉన్నారు. అందులో ఊర్వశి శారద ఒకరు. ఈమె సూపర్ స్టార్ కృష్ణ పదుల సంఖ్యలో హీరోయిన్‌గా చేసింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కృష్ణ పక్కన అగ్ని కెరటాలు, అగ్ని పర్వతం వంటి మూవీల్లో తల్లిగా చేసింది.

ఇక భానుప్రియ కూడా అంతే. వెంకటేష్ తో ఒకప్పుడు శ్రీనివాస కళ్యాణం, వారసుడొచ్చాడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి.. ఆ తర్వాత జయం మనదేరా మూవీలో వెంకటేష్ కు తల్లి రోల్ చేశారు. భానుమతి కూడా సీనియర్ ఎన్టీఆర్ పక్కన కథా నాయికగా నటించి.. ఆ తర్వాత సామ్రాట్ అశోక మూవీలో ఆయనకు ఎన్టీఆర్ తల్లి పాత్ర పోషించారు. ఇక ఇదే ఎన్టీఆర్ పక్కన వరలక్ష్మీ చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కలియుగ రాముడుతో పాటు ప్రేమ సింహాసనం లాంటి సినిమాల్లో ఎన్టీఆర్‌కు తల్లిగా చేసింది.

చిరంజీవితో మగధీరుడు మూవీలో హీరోయిన్ గా చేసిన జయసుధ.. రిక్షావోడు మూవీకి వచ్చే సరికి తల్లి పాత్రకు సరిపెట్టుకుంది. దివంగత నటి సుజాత మొదట్లో చిరంజీవి పక్కన ప్రేమ తరంగాలు మూవీలో కథానాయికగా చేసి ఆ తర్వాత బిగ్ బాస్ మూవీలో తల్లిగా నటించింది. ఏఎన్నార్ తో అంజలి దేవి ఎన్నో సినిమాల్లో నటించి హిట్ కొట్టింది. కానీ అదే హీరోకు తల్లిగా భక్త తుకారాం మూవీలో నటించింది.

Also Read: విజయ్ దేవరకొండ లైగర్ కి 60 కోట్ల డీల్
ఇక రీసెంట్ గా అయితే అనుష్క, ప్రభాస్ ది హిట్ పెయిర్ అని అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిల్లా, మిర్చి మూవీలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. కానీ బాహుబలి-2 లాంటి సెన్సేషన్ మూవీలో మాత్రం అనుష్క తల్లి పాత్రలో ఒదిగిపోయింది. అయినా కూడా ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.

ఇక యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఇదే కోవలోకి వచ్చింది. : నాగ చైతన్యతో కలిసి యుద్ధం శరణం మూవీలో ఆడిపాడింది. కానీ బంగార్రాజు మూవీకి వచ్చే సరికి మాత్రం నాగచైతన్యకు తల్లి రోల్ చేసింది. కానీ తల్లిగా చూపిస్తే బాగోదని ఆమె క్యారెక్టర్‌ను చంపేశారు.

Also Read: విజయ్ దేవరకొండ కాదు.. మరి ఎవరు ఆ హీరో ?