Heroine : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. అందులో చాలామంది నెంబర్ వన్ పొజిషన్ ని కైవసం చేసుకొని చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలిన వారే కావడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలకు పోటీగా హీరోయిన్లు సైతం ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి…
Also Read : తెలుగులో చేసింది రెండు సినిమాలే, ఇండియా వైడ్ పాపులర్… ఒక్క పెళ్లితో వేల కోట్ల అధిపతి అయిన హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ అనేది చాలా తక్కువ రోజులపాటు ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇక అందులో కొంతమంది వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇండస్ట్రీ లో చాలా మంచి కెరియర్ అయితే ఉంటుంది. అందుకే ఎవరు చూసినా కూడా భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అందువల్లే వీళ్ళ సినిమాలకి మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. తద్వారా హీరోయిన్లకి భారీ ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఇక ఒకప్పుడు చిరంజీవి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రంభ అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. మొదట్లో చిరంజీవి(Chiranjeevi) తో హిట్లర్ సినిమాలో కలిసి నటించి అతనికి చాలా మంచి జోడీగా మెప్పించింది. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ‘బావగారు బాగున్నారా’ సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో రంభ (Rambha) స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ఇక వరుసగా నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో వరుస సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత సినిమా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో స్పెషల్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసింది.
అందులో భాగంగానే దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలో సైతం ఆడిపాడింది. ఈ సినిమాతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంది.
ఇక ఆ తర్వాత కూడా అడపాదడప సాంగ్స్ లో నటించి మెప్పించింది. ఇక ఆమె ఇండస్ట్రీ కి చాలా రోజుల నుంచి దూరంగా ఉంటూ వస్తుంది. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయింది. ఇక అందులో భాగంగానే ఒక స్టార్ హీరో సినిమాలో నటించి మెప్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటుందట.
మరి అందులో కనక మెప్పించినట్లైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకు మంచి అవకాశాలైతే వస్తాయి. తద్వారా తనను తను మరోసారి ప్రూవ్ చేసుకునే అవకాశాలైతే ఉంటాయి. ఇంతకుముందు సినిమా హీరోయిన్గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రంభ ఇక మీదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ఆ హీరోయిన్ ఉందంటే ఆ సినిమా పాన్ ఇండియా హిట్టు కొట్టినట్టేనా..?