AP SSC Exams : ఏపీలో( Andhra Pradesh) పదో తరగతి పరీక్షలకు సంబంధించి సమయం ఆసన్నం అయ్యింది. ఈనెల 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రతిష్ట చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. పేపర్ లిక్ తో సహా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. గత అనుభవాల దృష్ట్యా పేపర్ లీకేజీ కాకుండా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : సంవత్సరానికి రెండు సార్లు బోర్డు పరీక్షలు.. పిల్లల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయా?
* లీకేజీ పై పటిష్ట చర్యలు
గతంలో పదో తరగతి పరీక్షల( 10th exams ) సమయంలో లీకేజీ అంశం కుదిపేసేది. ప్రభుత్వానికి చెడ్డపేరు కూడా తీసుకొచ్చేది. అందుకే ఈసారి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓ లతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లో అనుమతి లేదన్నారు. ఎవరైనా తీసుకువస్తే వాటిని పరీక్ష కేంద్రాల ప్రధాన గేటు వద్ద సేకరించి భద్రపరచాలన్నారు. పరీక్ష అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు అప్పగించాలన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించాలని ఆదేశాలు ఇచ్చారు.
* సోషల్ మీడియా పై నిఘా
అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై( social media) కూడా డేగ కన్ను వేసింది. చాలామంది పేపర్ లీకేజీ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తుంటారు. అటువంటి వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఎక్కడైనా అలాంటివి వ్యాప్తి జరిగితే వెంటనే విచారణ చేసి.. నకిలీ వార్తలు ప్రసారం చేసినట్లు తెలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల బీఈడీ పరీక్షల నిర్వహణ సమయంలో పేపర్ లీక్ వంటి వదంతులు వచ్చాయని.. అటువంటి వాటిపై పూర్తి అప్రమత్తంగా ఉండి.. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సి.ఎస్ ఆదేశించారు.
* 3450 పరీక్ష కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా( state wide) ఈనెల 17న ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి 3450 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 163 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. మొత్తం ఆరు లక్షల 19వేల 275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. రాష్ట్రస్థాయిలో 08662974540 నెంబర్ తో కూడిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మొత్తానికైతే గత అనుభవాల దృష్ట్యా పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.