https://oktelugu.com/

Suhasini: చిరంజీవి ఆరోజు గన్ బయటకి తీసి బెదిరించారు..నేను వణికిపోయాను అంటూ హీరోయిన్ సుహాసిని షాకింగ్ కామెంట్స్!

'చిరంజీవి నా ఎవర్ గ్రీన్ హీరో. ఆయనతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాను. ఆయన గురించి మీకెవ్వరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఒకసారి మేము షూటింగ్ కోసం కేరళకు వెళ్లాల్సి వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 18, 2024 / 12:02 PM IST

    Suhasini

    Follow us on

    Suhasini: మెగాస్టార్ చిరంజీవి చాలా నెమ్మదస్తుడు, గట్టిగా మాట్లాడలేడు, ఎవరి మనసుని నొప్పించలేడు వంటి విషయాలు మన అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో బలంగా మాట్లాడలేకనే ఆయన ఆ రంగం నుండి తప్పుకున్నాడు అంటూ చిరంజీవి పలుమార్లు తెలిపాడు. ఇది నిజమే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులను తన మాటలతో చీల్చి చెండాడేవాడు కానీ, చిరంజీవి మాత్రం తన ప్రత్యర్థుల మీద కూడా చాలా సున్నితంగా, నెమ్మదిగా మాట్లాడేవాడు. ఆ ఆరోజుల్లో చిరంజీవి కి సంబంధించి ఏ చెడు జరిగినా పవన్ కళ్యాణ్ నే మాట్లాడేవాడు. ఆయనే బలంగా ప్రతిఘటించేవాడు. అలాంటి చిరంజీవి కూడా తల్చుకుంటే ఎంత మంది రౌడీ మూకలకు అయినా సమాధానం చెప్పగలడు అని, వాళ్ళని పారిపోయేలా చేయగలడు అని గతం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సీనియర్ హీరోయిన్ సుహాసిని మాటలను చూసిన తర్వాత అర్థం అయ్యింది.

    ఆమె మాట్లాడుతూ ‘చిరంజీవి నా ఎవర్ గ్రీన్ హీరో. ఆయనతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాను. ఆయన గురించి మీకెవ్వరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఒకసారి మేము షూటింగ్ కోసం కేరళకు వెళ్లాల్సి వచ్చింది. ముందు కారులో చిరంజీవి వెళ్తుండగా, వెనుక కారులో నేను మరియు నా స్టాఫ్ ఉన్నాము. అనుకోకుండా కొన్ని తాగుబోతు రౌడీ మూకలు మా కారుని వెంబడించారు. అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ బీర్ బాటిల్స్ ని మా కారు అడ్డాలపై విసిరారు. నాకు చాలా భయం వేసింది, వణికిపోయాను. ఆ రౌడీ మూకలను గమనించిన చిరంజీవి వెంటనే కార్ దిగి వెనక్కి వచ్చారు. ఆ రౌడీ మూకలకు జోబులో నుండి తన గన్ తీసి, ఇక్కడి నుండి మర్యాదగా వెళ్లకపోతే ఒక్కొక్కరిని షూట్ చేసి పారేస్తాను అని బెదిరించారు. దీంతో దెబ్బకు రౌడీ మూకలు పరుగులు తీశారు. సినిమాల్లో విలన్స్ తో పోరాడే చిరంజీవి , నిజ జీవితంలో కూడా ఇంతటి హీరోయిజం చూపించడంతో ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను. ఆయన కారు దిగి వెనక్కి రాగానే, అయ్యో ఆయనకీ ఏమి అవుతుందో అని భయపడ్డాను. కానీ అంతమంది రౌడీలకు ఎలాంటి హింసకు తావు ఇవ్వకుండా చాలా కూల్ హీరోయిజం తో వారిని పారిపోయేలా చేసాడు చిరంజీవి’ అంటూ ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చింది సుహాసిని.

    ఇదే ఇంటర్వ్యూ లో చిరంజీవి కూడా ఉన్నాడు. ఆయనని సుహాసిని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ సంఘటనలను మొత్తం మీకు గుర్తు ఉన్నాయా’ అని అంటుంది. అప్పుడు చిరంజీవి సమాధానం చెప్తూ ‘ఇలాంటి విషయాలను ఎలా మర్చిపోతాము. సినీ సెలెబ్రిటీలు అయ్యినప్పటికీ కూడా ఆరోజు వాళ్ళు మనల్ని వెంబడించడం ఊహకందని పరిణామం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ పాత ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా లో అభిమానులు లేటెస్ట్ గా అప్లోడ్ చేస్తూ మళ్ళీ వైరల్ చేస్తున్నారు. చిరంజీవి ధైర్య సాహసాల గురించి పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.