Shweta Basu Prasad
Shweta Basu Prasad : కొంతమంది హీరోయిన్లు అందం, నటన ఉన్నప్పటికీ కేవలం రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితమై ఆ తర్వాత అసలు కనిపించకుండా పోతుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు శ్వేతా బసు ప్రసాద్(Swetha Basuprasad). బాలనటిగా హిందీ లో పలు టీవీ సీరియల్స్ లోను, సినిమాల్లోనూ నటించిన ఈమె, 2008 వ సంవత్సరంలో వరుణ్ సందేశ్(Varun Sandesh) హీరో గా నటించిన ‘కొత్త బంగారు లోకం’ చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే పాపం ఈ హీరోయిన్ కి మన తెలుగు లో అదే మొదటి హిట్, చివరి హిట్ కూడా. ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు లో ‘రైడ్’, ‘కళావర్ కింగ్’, ‘కాస్కో’, ‘ప్రియుడు’, ‘జీనియస్’ వంటి చిత్రాల్లో నటించింది. ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు.
ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకొని అరెస్ట్ అయిన శ్వేతా బసు ప్రసాద్, మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. అయితే దర్శక నిర్మాతలు ఆమెని హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు కానీ, క్యారక్టర్ రోల్స్ కి మాత్రం తీసుకుంటున్నారు. తెలుగు లో ఈమె చివరిసారిగా కనిపించిన చిత్రం ‘విజేత’. 2018 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె మన ఆడియన్స్ కి కనిపించలేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈమె మన ఇండస్ట్రీ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘తెలుగు లో నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు, షూటింగ్ సెట్స్ లో చాలా అవమానాలకు గురయ్యాను. సెట్స్ అందరూ నేను హీరో కంటే పొడవు తక్కువ ఉన్నానని వెక్కిరించేవారు. హీరో ఆరు అడుగులు ఎత్తుంటే, నేను 5 అడుగులు మాత్రమే ఉన్నాను’.
‘సెట్స్ లో పని చేసే ప్రతీ ఒక్కరు నన్ను వెక్కిరించేవారు, చాలా బాధపడ్డాను. ఇక హీరో అయితే మామూలోడు కాదు. మాటికొస్తే సన్నివేశాలను మారుస్తూ ఉండేవాడు. అత్యధిక సార్లు రీ టేక్స్ తీసుకునేవాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కుర్రాడు అయినప్పటికీ తెలుగు డైలాగ్స్ చెప్పడం రాదు. నేను తెలుగు అమ్మాయిని కాకపోయినప్పటికీ, షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టే ముందు డైలాగ్స్ బాగా నేర్చుకొని వచ్చేవాడిని. కానీ అతను మాత్రం తన మాతృ బాషని కూడా సరిగా మాట్లాడలేకపోయేవాడు. నేను పొట్టిగా ఉన్నానంటే అది నాకు వారసత్వం ద్వారా వచ్చింది. కానీ నేను నా మాతృభాషను అనర్గళంగా మాట్లాడగలను, అతను మాత్రం అందులో సున్నా. అతన్ని ఎవ్వరూ వెక్కిరించరు, పొట్టిగా ఉన్నానని నన్ను మాత్రం వెక్కిరించేవారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లతో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతుంది.