https://oktelugu.com/

Nijam Movie : నేను బ్రతికి ఉన్నానో లేదో కూడా మహేష్ బాబు కు తెలియదు అంటూ ‘నిజం’ మూవీ ఫేమ్ రామేశ్వరి షాకింగ్ కామెంట్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోయినా, వాటికి క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ వస్తుంటాయి.

Written By: , Updated On : February 17, 2025 / 03:41 PM IST
Nijam Movie

Nijam Movie

Follow us on

Nijam Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోయినా, వాటికి క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆయనలోని అద్భుతమైన నటుడిని బయటకి తీసుకొచ్చిన అత్యధిక సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. వాటిల్లో ‘నిజం'(Nijam Movie) చిత్రం ఒక్కటి. ‘ఒక్కడు’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు, ‘నువ్వు నేను’, ‘జయం’ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రమిది. గోపీచంద్ ఇందులో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం లో మహేష్ బాబు కి ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుందో, అతని తల్లి క్యారక్టర్ చేసిన రామేశ్వరి(Rameshwari) గారికి కూడా అంతే స్క్రీన్ స్పేస్ ఉంటుంది.

అమాయకుడైన తన కొడుకుని విలన్స్ ని ఎదురుకునే ధీటైన మగాడిగా తీర్చే దిద్దే తల్లి పాత్రలో రామేశ్వరి చాలా అద్భుతంగా నటించింది. ఆమె నటన కూడా చాలా పవర్ ఫుల్ అనిపించింది. అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మహేష్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. యాంకర్ మాట్లాడుతూ ‘మహేష్ బాబు ఇప్పటికీ మీతో మాట్లాడుతూ ఉంటాడా..? ‘ అని అడగ్గా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘అసలు నేను బ్రతికి ఉన్నాననే విషయం కూడా అతనికి తెలిసి ఉండదు’ అంటూ చెప్పుకొస్తుంది. దీనిని సోషల్ మీడియా లో మహేష్ బాబు దురాభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ కూడా వాళ్లకు ధీటైన సమాధానం చెప్తున్నారు. అదే ఇంటర్వ్యూ లో ఆమె మహేష్ గురించి గొప్పగా చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ని కూడా అప్లోడ్ చేసారు.

ఆ వీడియోలో రామేశ్వరి మాట్లాడుతూ ‘మహేష్ బాబు ఉన్న ఒక ఈవెంట్ కి నేను వెళ్లాను. ఆయన వెనుక సీట్ లోనే నేను కూడా కూర్చున్నాను. మహేష్ నన్ను చూసి మీరు కూడా వచ్చారా?, నన్ను పలకరించలేదేంటి అని అడిగాడు. మీరేదో హడావుడిలో ఉంటారని పలకరించలేదు బాబు అని నేను అన్నాను. అప్పుడు మహేష్ మీరు నన్ను కొట్టి కూడా పలకరించొచ్చు , తెలుసా మీకు అది అని అన్నాడు. తెలుసు బాబు, నీ దగ్గర నాకు ఆ చనువు ఉంది, కానీ నేను ఆ చనువుని తీసుకోను అని చెప్పాను’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు తన తోటి నటీనటులతో ఎంత మంచిగా ఉంటాడో చెప్పడానికి ఈమె మాటలను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.