https://oktelugu.com/

Heroine Samyuktha Menon: నీకు అవి చిన్నగా ఉన్నాయని విమర్శించారు… లక్కీ హీరోయిన్ సంయుక్త షాకింగ్ కామెంట్స్!

దర్శకుడు త్రివిక్రమ్ ఆమెకు అల్లు అర్జున్ సరసన ఛాన్స్ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సంయుక్తను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. చూస్తుంటే సంయుక్త టాలీవుడ్ స్టార్ లేడీగా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : May 15, 2023 / 08:44 AM IST
    Follow us on

    Heroine Samyuktha Menon: టాలీవుడ్ లక్కీ గర్ల్ గా అవతరించింది సంయుక్త మీనన్. ఈ మలయాళ బ్యూటీ నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సంయుక్త మొదటి విజయం అందుకుంది. బింబిసార, సార్ విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. విరూపాక్షతో మరో భారీ హిట్ నమోదు చేసింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష విశేష ఆదరణ సొంతం చేసుకుంది. సస్పెన్సు థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించింది. సంయుక్త నెక్స్ట్ టార్గెట్ స్టార్ హీరోలే.

    దర్శకుడు త్రివిక్రమ్ ఆమెకు అల్లు అర్జున్ సరసన ఛాన్స్ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సంయుక్తను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. చూస్తుంటే సంయుక్త టాలీవుడ్ స్టార్ లేడీగా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది. వరుస హిట్స్ ఇస్తున్న సంయుక్త మాత్రం కెరీర్ బిగినింగ్ లో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నారట. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఇప్పటి వరకు నేను 20 సినిమాలు చేశాను. ప్రతి సినిమాకు ముందు స్క్రీన్ టెస్ట్ లో పాల్గొంటాను. అన్ని రకాల ఎమోషన్స్ నటించి చూపిస్తాను. మొదట్లో నా కళ్ళు చిన్నగా ఉన్నాయని కొందరు ఎగతాళి చేశారు. అంత చిన్న కళ్ళలో ఎక్స్ప్రెషన్స్ పలకడం కష్టమని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే కళ్ళతో ఆడియన్స్ ని మెప్పిస్తున్నాను… అని సంయుక్త చెప్పుకొచ్చారు.

    ఇక వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ… సంయుక్తకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరట. స్నేహాలు ఆమె ఇష్టపడరట. ఒంటరిగా ఉండటాన్ని ఆస్వాదిస్తారట. ఖాళీ సమయం దొరికితే కొచ్చిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లిపోతుందట. సినిమా షూటింగ్స్ లేకపోతే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం ఇష్టమట. హిమాలయాలకు ట్రెక్కింగ్ కి వెళుతుందట. పవిత్ర క్షేత్రాల్లో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ మానసిక ప్రశాంతత పొందటం సంయుక్తకు ఇష్టమైన వ్యాపకం అట. చూస్తుంటే సంయుక్తకు దైవ భక్తి చాలా ఎక్కువనిపిస్తుంది. ప్రస్తుతం సంయుక్త డెవిల్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ బింబిసార చిత్రంలో జతకట్టారు. హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు.