https://oktelugu.com/

Senior Actor Naresh Assets: నిత్య పెళ్లి కొడుకు నరేష్ ఎంత పెద్ద కోటేశ్వరుడో తెలుసా? ఆస్తి విలువ తెలిస్తే మైండ్ బ్లాకే!

కామెడీ హీరోగా నరేష్ పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన కొన్ని రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. నరేష్ సక్సెస్ఫుల్ యాక్టర్. ఏ దశలోనూ ఆయన కెరీర్ నెమ్మదించలేదు.

Written By:
  • Shiva
  • , Updated On : May 15, 2023 / 08:39 AM IST

    Senior Actor Naresh Assets

    Follow us on

    Senior Actor Naresh Assets: నటుడు నరేష్ ఆస్తుల గురించి ఓ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన లేటెస్ట్ మూవీ మళ్ళీ పెళ్లి ట్రైలర్ చూసి జనాలు ఆయన ఆస్తుల విలువ మీద ఒక అంచనాకు వచ్చారు. నరేష్ కి ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా? అని వాపోతున్నారు. నరేష్ కెరీర్ పరిశీలిస్తే ఆయన విజయ నిర్మల వన్ అండ్ ఓన్లీ సన్. సూపర్ స్టార్ కృష్ణ ఆయనకు స్టెప్ ఫాదర్ అవుతారు. చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చాడు. నరేష్ ది ఐదు దశాబ్దాల ప్రస్థానం. పరిశ్రమలో పుట్టి పెరిగాడు. టీనేజ్ లోనే హీరో అయ్యారు.

    కామెడీ హీరోగా నరేష్ పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన కొన్ని రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. నరేష్ సక్సెస్ఫుల్ యాక్టర్. ఏ దశలోనూ ఆయన కెరీర్ నెమ్మదించలేదు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు సంపాదించారు. తల్లిదండ్రుల నుండి ఆయనకు కొంత ఆస్తి సమకూరింది. కృష్ణకు విజయనిర్మల అంటే ప్రాణం. విజయనిర్మల-కృష్ణ నరేశ్ వద్దే ఉండేవారు. వారిద్దరూ నరేష్ కి కొంత ఆస్తి ఇచ్చారని సమాచారం.

    ఒక అంచనా ప్రకారం నరేష్ ఆస్తి విలువ వెయ్యి కోట్లకు పైమాటే. ఈ విషయాన్ని ఆయనే పరోక్షంగా చెప్పారు. మళ్ళీ పెళ్లి చిత్ర ట్రైలర్ లో నరేష్ అసిస్టెంట్ ‘మీకేంటి సార్ వెయ్యి కోట్ల ఫిగర్’ అని అంటాడు. సినిమాలో డైలాగ్ ఆధారంగా నరేష్ ఆస్తుల గురించి అంచనాకు రావడం కరెక్టేనా? అని అనిపించొచ్చు. మళ్ళీ పెళ్లి నరేష్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. ఆయన లైఫ్ లో వాస్తవంగా చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే మళ్ళీ పెళ్లి.

    కాబట్టి నరేష్ ఈ మూవీలో తన ఆస్తుల గురించి రాసుకున్న డైలాగ్ నిజమే, ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తి ఉందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇక మళ్ళీ పెళ్లి మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహించారు. నరేష్ స్వయంగా నిర్మించారు. నరేష్ కి జంటగా పవిత్ర లోకేష్ నటిస్తున్నారు. వనిత విజయ్ కుమార్ కీలక రోల్ చేస్తున్నారు. మళ్ళీ పెళ్లి ప్రోమోలు ఆకట్టుకున్న తరుణంలో అంచనాలు ఏర్పడ్డాయి.