Bigg Boss 8 Telugu: భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 1 వ తారీఖున ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎపిసోడ్ నుండే హీట్ వాతావరణంలో ముందుకు దూసుకుపోతుంది. గత సీజన్లో లాగానే ఈ సీజన్ కూడా ఎక్కువ సెంటిమెంట్ మీద ఆధారపడినట్టుగా ఆడియన్స్ నుండి వినిపిస్తున్న టాక్. అయితే కంటెస్టెంట్స్ అందరూ కొత్తవాళ్లు కావడం, కేవలం విష్ణు ప్రియ, ఆదిత్య ఓం తప్ప ఎవరికీ పెద్దగా ముందు నుండే ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల వోటింగ్ సరళి రోజుకి ఒకలాగా మారిపోతుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లేందుకు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ విష్ణు ప్రియ, నాగ మణికంఠ, బెజవాడ బేబక్క, పృథ్వీ రాజ్, శేఖర్ బాషా మరియు సోనియా. వీరిలో అందరికంటే భారీ లీడింగ్ తో విష్ణు ప్రియ మొదటి స్థానం లో కొనసాగుతుంది. ఆమెకు ముందు నుండే ఎంటర్టైన్మెంట్ షోస్ కారణంగా మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో పాటుగా, ఆమె నడవడిక కూడా ప్రేక్షకులకు నచ్చడంతో ఓటింగ్ ఆ స్థాయిలో పడుతుంది.
ఇక ఆమె తర్వాత రెండవ స్థానం లో కొనసాగుతున్న వ్యక్తి నాగ మణికంఠ. మన తెలుగు ఆడియన్స్ ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పడానికి గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఒక ఉదాహరణగా నిలిచాడు. ఈ సీజన్ కి అలా నాగ మణికంఠ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతను విష్ణు ప్రియ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. రాబోయే రోజుల్లో ఇతను విష్ణు ప్రియ ఓటింగ్ ని దాటేసిన ఆశ్చాత్ర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. అలాగే మూడవ స్థానం లో పృథ్వీ రాజ్ కొనసాగుతున్నాడు. ఇతను ఇప్పటి వరకు టాస్కులు బాగా ఆడకపోయినా, చూసేందుకు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించడంతో ఇతనికి మూడవ స్థానాన్ని ప్రస్తుతానికి కట్టబెట్టారు ఆడియన్స్. ఇక నాల్గవ స్థానం లో బెజవాడ బేబక్క సాగుతుంది. ఇక్కడ అసలు సిసలు ట్విస్ట్ ఏమిటంటే నిన్న మొన్నటి వరకు ఈమె డేంజర్ జోన్ లో కొనసాగుతూ ఉండేది. కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు.
కానీ అనూహ్యంగా ఆమె డేంజర్ జోన్ నుండి బయటకి వచ్చి ఇప్పుడు నాల్గవ స్థానం లో కొనసాగుతుంది. ఇంతకు ముందు ఈ స్థానంలో శేఖర్ బాషా కొనసాగేవాడు, కానీ ఇప్పుడు శేఖర్ బాషా డేంజర్ జోన్ లో ఉన్నాడు. శేఖర్ బాషా డేంజర్ జోన్ లో ఉండడం ఏమిటి ?, అతను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపిస్తున్నది మీరు అనుకోవచ్చు, కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి చివరి నుండి టాప్ 2 స్థానంలో కొనసాగుతుంది. ఇక చివరి స్థానం లో, అంటే కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే రేంజ్ ఓటింగ్ దక్కించుకున్న కంటెస్టెంట్ సోనియా. ఈమె మాట తీరు చూస్తే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపిస్తుంది, కానీ ఈ వారం ఆమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి , చూడాలి మరి ఏమి జరగబోతుందో.