Homeఎంటర్టైన్మెంట్Heroine Samantha: సమంతకు ఆ బరువు ఎక్కువైందా

Heroine Samantha: సమంతకు ఆ బరువు ఎక్కువైందా

Heroine Samantha: “ప్రేమంటే జ్ఞాపకాలు. అవి మంచివైనా చెడ్డవైనా మనం మోస్తూనే ఉండాలి” ఇదీ ఓ సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంత కూడా ఆ బరువునే మోస్తోంది. దాని నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. కొన్ని నెలల నుంచి సమంత మీడియాకు దూరంగా ఉంటున్నది. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. పైగా అప్పుడెప్పుడో 38 ఏళ్ల క్రితం లూయిస్ హే అనే రచయిత్రి రాసిన “యూ కెన్ హీల్ యువర్ లైఫ్ ” అనే పుస్తకాన్ని చదువుతోంది. ఇటీవల ఆ పుస్తకం ఆమె చేతిలో ఉన్నట్టు కంటపడటంతో ఆమె గతం తాలూకు జ్ఞాపకాలనుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తోందని అర్థం అవుతోంది. వ్యక్తిత్వ వికాసం, సానుకూలమైన జీవితంపై అడుగులు వేయడం ఆ పుస్తకం సారాంశం. కానీ అప్పుడెప్పుడో మార్కెట్లోకి వచ్చిన ఆ పుస్తకాన్ని సమంత ఇప్పుడు చదవడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Heroine Samantha
Heroine Samantha

ప్రేమంటే కబీ ఖుషి కబీ గమ్ కాదు..

నాగచైతన్యతో ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత భేదా భిప్రాయాలు తలెత్తి ఇద్దరూ విడిపోయారు. ఇక అప్పటినుంచి ఏదో ఒక రూపంలో సమంత తన సంసార జీవితం పట్ల వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షో లో చాలా విషయాలను బోల్డ్ గానే మాట్లాడింది. పెళ్లంటే కబీ ఖుషి కబీ గమ్ సినిమాలా ఉంటుందని అనుకున్నానని, కానీ అందులోకి దిగాక అది కేజీఎఫ్ అని అర్థమైందని కుండబద్దలు కొట్టింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆమెపై భారీగానే దాడి జరిగింది. ఈ సమయంలో సమయమనం పాటించినా.. కొన్నిసార్లు మాత్రం తన ఆగ్రహాన్ని దాచుకోలేక ముక్కుసూటిగానే సమాధానం చెప్పింది. అలాంటి సమంత ప్రస్తుతం మూడు నెలల పాటు మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. వ్యక్తిగతంగా ఎంతో తెగువతో ఉండే సమంత.. మీడియాతో ఎందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అనే ప్రశ్న ఇప్పుడు ఆమె అభిమానుల్లో తలెత్తుతోంది. జీవితంలో పెళ్లి అనేది ఎవరికైనా ఒక మధుర ఘట్టం. ఆ బంధం విచ్ఛిన్నమైతే ఆ జ్ఞాపకాల నుంచి బయటపడటం ఎవరికైనా ఇబ్బంది కరం. ఇందుకు సమంత కూడా మినహాయింపు ఏమీ కాదు.

Heroine Samantha
Heroine Samantha

ప్రస్తుతం కెరియర్ పరంగా సమంతకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు గతం తాలుకూ జ్ఞాపకాలు దాడి చేస్తూనే ఉంటాయి కాబట్టి కొంత మానసిక ఆందోళన ఉంటుంది. నాగచైతన్య తో విడాకులు తీసుకొని ఏడాది కావస్తున్నా మీడియాకు ముఖం చాటేయాలనుకోవడం, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం సమంత మనోనిబ్బరం గురించి తెలిసిన వారు ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ ని అదే స్థాయిలో తీపి కొడుతున్న సమంత.. పెళ్లి విషయానికి వచ్చేసరికి వైరాగ్యంగా సమాధానం చెబుతుండటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం సమంత హైదరాబాదులో కాకుండా ముంబై లో ఉంటున్నారు. బాంద్రా లో ఇటీవల ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో గుణశేఖర్ తీస్తున్న శాకుంతలం, దిల్ రాజు, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న యశోద, విజయ్ తో నటిస్తున్న ఖుషి.. ఒక ఖుషి మినహా మిగతా సినిమాలు హీరోయిన్ సెంట్రింగ్ గా ఉన్నవే. అయితే సమంత గతం తాలూకు జ్ఞాపకాలు నుంచి త్వరగా బయటపడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular