Sakshi Shivanand: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరియర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. ఎంత తొందరగా సక్సెస్ అవుతారో, అంతే తొందరగా ఫేడ్ అవుట్ కూడా అయిపోతున్నారు. హీరోలకు అయితే ఇండస్ట్రీ లో లాంగ్ కెరీయర్ ఉంటుంది. కానీ హీరోయిన్స్ విషయంలో అలా జరగదు. వాళ్లకు ఎంత తొందరగా స్టార్ట్ డమ్ వస్తుందో, ఒక రెండు ప్లాప్ లు వస్తే అంతే తొందరగా వాళ్ల క్రేజ్ తగ్గిపోతుంది. దీని వల్ల అవకాశాలు కూడా తగ్గిపోతాయి. మరి ఇలాంటి సమయంలో కూడా ఒక హీరోయిన్ దాదాపు 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగింది అంటే మామూలు విషయం కాదు.ఇంతకు ఆమె ఎవరు అని అనుకుంటున్నారా ఒకప్పుడు యూత్ ను తన అంద చందాలతో ఒక ఊపు ఊపేసిన సాక్షి శివానంద్…
ఈమె తెలుగులో ఉన్న స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రాజశేఖర్ లతో నటించి మెప్పించింది. ఇక ఈమె 1996 వ సంవత్సరంలో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబు తో యువరాజు, రాజశేఖర్ తో సింహరాశి లాంటి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంత గ్యాప్ అయితే తీసుకుంది. ఇక 2008 వ సంవత్సరంలో జగపతిబాబు హీరోగా చక్రవర్తి డైరెక్షన్ లో వచ్చిన ‘హోమం’సినిమాలో నటించింది. అలాగే 2010 వ సంవత్సరంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘రంగ ది దొంగ’ సినిమాలో కూడా నటించి మెప్పించింది.
అయితే ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడంతో ఇక ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు దాంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని తను లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అప్పుడు ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న సాక్షి శివానంద్ ప్రస్తుతం చాలా హ్యాపీగా తన ఫ్యామిలీ ని లీడ్ చేస్తుంది…తెలుగు లో ఒక మంచి క్యారెక్టర్ దొరికితే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉంది…