https://oktelugu.com/

Heroine Gets Cheated: అరెరే.. ఆ హీరోయిన్ని దారుణంగా మోసం చేశారట !

Heroine Gets Cheated: హీరోయిన్ రిమిసేన్ గుర్తుందా ? పేరు ఎప్పుడు వినలేదు అంటారా ? పై ఫోటో చూడండి. ఈమెనే రిమిసేన్. హిందీ, బెంగాలీతో పాటు తెలుగులోనూ హీరోయిన్ నటించింది. ‘నీ తోడు కావాలి‘ అనే సినిమాలో రిమిసేన్ సెకండ్ హీరోయిన్. అయితే, తాజాగా పాపం రిమిసేన్ మోసపోయింది. మోసం చేసే వారిని నమ్మడంతోనే ఈమె మోసపోవడం బాధాకరమైన విషయం. అసలు రిమిసేన్ ఏ విషయంలో మోసపోయిందని ఆత్రుతగా అడుగుతున్నారు నెటిజన్లు. మోసం స్నేహితుడి విషయంలోనే. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 31, 2022 / 06:34 PM IST
    Follow us on

    Heroine Gets Cheated: హీరోయిన్ రిమిసేన్ గుర్తుందా ? పేరు ఎప్పుడు వినలేదు అంటారా ? పై ఫోటో చూడండి. ఈమెనే రిమిసేన్. హిందీ, బెంగాలీతో పాటు తెలుగులోనూ హీరోయిన్ నటించింది. ‘నీ తోడు కావాలి‘ అనే సినిమాలో రిమిసేన్ సెకండ్ హీరోయిన్. అయితే, తాజాగా పాపం రిమిసేన్ మోసపోయింది. మోసం చేసే వారిని నమ్మడంతోనే ఈమె మోసపోవడం బాధాకరమైన విషయం.

    Rimi Sen

    అసలు రిమిసేన్ ఏ విషయంలో మోసపోయిందని ఆత్రుతగా అడుగుతున్నారు నెటిజన్లు. మోసం స్నేహితుడి విషయంలోనే. న‌టి రిమిసేన్ ను ఆమె స్నేహితుడే దారుణంగా మోసం చేశాడు. గోరేగావ్‌ కు చెందిన రౌనక్ జతిన్ వ్యాస్ అనే బిజినెస్ మ్యాన్‌తో 3 ఏళ్ల క్రితం రిమికి ఓ జిమ్‌లో స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమె అతనితో రెగ్యులర్ గా టచ్ లో ఉండేది.

    అయితే.. ఆమె స్నేహాన్ని అర్థం చేసుకున్న రౌనక్ జతిన్ వ్యాస్ చాలా తెలివిగా ఆమెకు మాయమాటలు చెబుతూ వచ్చాడు. తాను ఓ కొత్త కంపెనీలో పెట్టుబడులు పెట్టాను అని.. పెట్టుబడి పెట్టిన నెలలోనే రెట్టింపు లాభాలు తనకు వచ్చాయని ఆమెను నమ్మించాడు. దాంతో రిమిసేన్ వెనకాముందు ఆలోచించకుండా రూ.4.14కోట్లు అతని చేతిలో పెట్టింది.

    కట్ చేస్తే.. ఎవరండీ మీరు ? అంటూ చాలా ఈజీగా ప్లేట్ తిప్పేశాడు. ఉన్నదంతా పోగొట్టుకుంటే గానీ.. రిమిసేన్ కి తత్వం బోధపడలేదు. విషయం అర్ధం అయ్యింది. తాను దారుణంగా మోసపోయాను అని అర్ధం చేసుకుంది. వెంటనే.. తనను ఫ్రెండ్ మోసం చేశాడని హీరోయిన్ రిమిసేన్ పోలీసులకు కంప్లైంట్ చేసింది

    ఓ కొత్త కంపెనీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి తన నుంచి రూ.4.14కోట్లు తీసుకొని మోసం చేశాడు అంటూ రిమి సేన్ చెబుతుంది. పాపం, రిమి సేన్ ఎంతో కష్టపడి సంపాదించుకుంది. అయితే ఆమె స్నేహితుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నాడట. నీ సంపాదనకు నేను కూడా కారణం అంటున్నాడట. మొత్తానికి రిమి సేన్ స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయింది.

    Tags